సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్: ఏకంగా ఐదు అవార్డ్స్ కొల్లగొట్టిన అల వైకుంఠపురంలో.. బన్నీ ఫుల్ ఖుషీ!

By team teluguFirst Published Sep 18, 2021, 8:20 AM IST
Highlights

ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ మ్యూజిక్స్ డైరెక్టర్ అవార్డ్స్ అల వైకుంఠపురంలో చిత్రానికి దక్కాయి. ఐదు ప్రధాన విభాగాల్లో అవార్డ్స్ దక్కడంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ వేదికగా సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్ ఏడవ ఎడిషన్ వేడుక ఘనంగా జరుగగా, టాలీవుడ్ టాప్ స్టార్స్ వేదికపై సందడి చేశారు. కాగా అల వైకుంఠపురంలో చిత్రం అన్ని ప్రధాన విభాగాలలో అవార్డ్స్ దక్కించుకొని సత్తా చాటింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ మ్యూజిక్స్ డైరెక్టర్ అవార్డ్స్ అల వైకుంఠపురంలో చిత్రానికి దక్కాయి. ఐదు ప్రధాన విభాగాల్లో అవార్డ్స్ దక్కడంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేశారు. 


ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా తన ఆనందం పంచుకున్నారు.. అల సాక్షి అవార్డ్స్ లో... అంటూ అల వైకుంఠపురంలో టీమ్ త్రివిక్రమ్, పూజా హెగ్డే, థమన్, నాగవంశీ, రాధా కృష్ణలతో ఫొటోలకు ఫోజిచ్చారు. పుష్ప షూటింగ్ కి స్వల్ప విరామం ప్రకటించి, సాక్షి అవార్డ్స్ వేడుకకు అల్లు అర్జున్ హాజరయ్యారు. అదే సమయంలో అపోలో హాస్పిటల్ నందు చికిత్స తీసుకుంటున్న సాయి ధరమ్ తేజ్ ని సందర్శించడం జరిగింది. 


2020 సంక్రాంతి కానుకగా విడుదలైన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ వసూళ్లు నమోదు చేసింది. నాన్ బాహుబలి రికార్డ్స్ తో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అల వైకుంఠపురంలో చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ముఖ్యంగా థమన్ సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ సాంగ్స్ యువతను ఊపేశాయి. 
 

Ala Sakshi Awards Lo ! pic.twitter.com/i3iV0YOcHS

— Allu Arjun (@alluarjun)
click me!