చైతు ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్!

By Udayavani DhuliFirst Published 21, Aug 2018, 12:12 PM IST
Highlights

అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అత్త, అల్లుడు నేపధ్యంలో సాగే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి

అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అత్త, అల్లుడు నేపధ్యంలో సాగే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముందుగా ఈ సినిమా ఆగస్టు 31న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

కానీ ఇప్పుడు అనుకున్న డేట్ కి సినిమా రిలీజ్ కావడం లేదని తెలుస్తోంది. దర్శకుడు మారుతి ఈ సినిమా రీరికార్డింగ్ కోసం కేరళ వెళ్లారు. సంగీత దర్శకుడు గోపిసుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ ఇద్దరూ కూడా కేరళ వరదల్లో చిక్కుకోవడంతో రీరికార్డింగ్ పని పూర్తి కాలేదని తెలుస్తోంది.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు హీరో నాగచైతన్య ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా వాయిదా వేస్తున్నట్లు దానికి క్షమించమని కోరుతూ పోస్ట్ పెట్టాడు.

 

 

Last Updated 9, Sep 2018, 11:55 AM IST