`సారంగ దరియా` అన్నీ రికార్డులు బ్రేక్‌.. బన్నీ మైండ్‌ బ్లాంక్‌..!

Published : Apr 01, 2021, 09:56 AM IST
`సారంగ దరియా` అన్నీ రికార్డులు బ్రేక్‌.. బన్నీ మైండ్‌ బ్లాంక్‌..!

సారాంశం

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల రూపొందించిన `లవ్‌స్టోరీ` చిత్రంలోని  `సారంగ దరియా` పాట విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇది మరోసంచలనం క్రియేట్‌ చేసింది. అత్యంత వేగంగా వంద మిలియన్స్ వ్యూస్‌ని దక్కించుకున్న మొదటి తెలుగు పాటగా నిలిచింది. 

`సారంగ దరియా` ప్రస్తుతం యూట్యూబ్‌ని షేక్‌ చేస్తున్న సాంగ్‌. అత్యంత వేగంగా మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతున్న సాంగ్‌. తెలంగాణ జానపద పాట సినిమా పాటగా మారడంతో ఓ ఊపు ఊపు ఊపేస్తుంది. ఊహించని విధంగా భారీ వ్యూస్‌తో దూసుకుపోతుంది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల రూపొందించిన `లవ్‌స్టోరీ` చిత్రంలోని పాట ఇది. విశేషంగా ఆకట్టుకుంటుంది. అర్థవంతమైన అర్థంతో కూడిన ఈ జానపద పాట వివాదాలను అధిగమించుకుని వైరల్‌ అవ్వడం, సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేయడం విశేషం. 

అయితే ఇది మరోసంచలనం క్రియేట్‌ చేసింది. అత్యంత వేగంగా వంద మిలియన్స్ వ్యూస్‌ని దక్కించుకున్న మొదటి తెలుగు పాటగా నిలిచింది. ఇంత వేగంగా ఈ రికార్డ్ ని క్రియేట్‌ చేయడం విశేషం. లిరికల్‌ సాంగ్‌ విభాగంలో విడుదల చేసిన నెల రోజుల్లోనే వంద మిలియన్స్‌ వ్యూస్‌ని పొందిన తొలి సాంగ్‌గా నిలిచింది. గతంలో అల్లు అర్జున్‌ నటించిన `అల వైకుంఠపురములో` చిత్రంలోని పాటల రికార్డ్ లను బ్రేక్‌ చేసింది. ఇంకా చెప్పాలంటే గతంలో ఉన్న అన్ని రికార్డులను ఇది తిరగరాసింది. సరికొత్త సంచలనం క్రియేట్‌ చేసింది. బన్నీ, త్రివిక్రమ్‌, థమన్‌లకు మైండ్‌ బ్లాంక్‌ చేసింది.

ఇక ఈ పాటని మంగ్లీ పాడగా, పవన్‌ సీహెచ్‌ సంగీతం అందించారు. ఈ పాటలో సాయిపల్లవి నర్తించడం స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీనికి శేఖర్‌ మాస్టర్‌ స్టెప్పులు తోడయ్యాయి. మరి ఇది మున్ముందు ఇంకెన్ని రికార్డ్ లు సృష్టిస్తుందో చూడాలి. ఇక `లవ్‌స్టోరీ` సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?