సాయిపల్లవి బర్త్ డే సర్‌ప్రైజెస్‌..ఓ వైపు అమ్మోరు తల్లిగా, మరోవైపు విప్లవ అక్షరాలు దిద్దుతూ..

By Aithagoni RajuFirst Published May 9, 2021, 12:23 PM IST
Highlights

సాయిపల్లవి ప్రస్తుతం `విరాటపర్వం`లో వెన్నెలగా నటిస్తుంది. దీంతోపాటు నాని హీరోగా రూపొందుతున్న `శ్యామ్‌సింగరాయ్‌` చిత్రంలో హీరోయిన్‌గాచేస్తుంది. అలాగే `లవ్‌ స్టోరి`లోనూ నటిస్తుంది. 

సాయిపల్లవి సహజమైన అందం, సహజమైన నటి. మలయాళంలో నటించిన `ప్రేమమ్‌` చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయింది. అదే ఊపులో తెలుగులో `ఫిదా` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ కూడా తొలి సినిమాతోనే స్టార్‌ అయిపోయింది. కమర్షియలిటీకి అతీతంగా విభిన్నమైన పాత్రలున్న భిన్నమైన సినిమాలు చేస్తూ రాణిస్తుంది. తనకంటూ ప్రత్యేకతని చాటుకుంటోంది. తాజాగా ఈ అమ్మడు తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

`విరాటపర్వం`లో వెన్నెలగా నటిస్తుంది. దీంతోపాటు నాని హీరోగా రూపొందుతున్న `శ్యామ్‌సింగరాయ్‌` చిత్రంలో హీరోయిన్‌గాచేస్తుంది. అలాగే `లవ్‌ స్టోరి`లోనూ నటిస్తుంది. నేడు(మే9) సాయిపల్లవి బర్త్ డే. తన 29వ పుట్టిన రోజుని జరుపుకుంటోన్న సాయిపల్లవి బర్త్ డేని పురస్కరించుకుని `విరాటపర్వం` నుంచి కొత్త లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ఆమె గోడపై కమ్యూనిస్ట్ అక్షరాలు దిద్దుతుంది. ఇందులో సాయిపల్లవి వెన్నెలగా నక్సల్‌ సానుభూతి పరురాలిగా, హీరో రానాకి లవ్ ఇంట్రెస్ట్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. 

ఈ సంక్షోభ సందర్బాన,మీకు పుట్టినరోజు విషెస్ చెప్పటం సహేతుకం అనిపించలేదు.
అందుకే పోస్టర్ ని కూడా విడుదల చేయలేదు.
మీ అభినయ విశేషముతో
ఈ రత్నఖచిత భువనాన
తీరొక్క పూల కవనమై వెలుగొందే మీలాంటి హృదయగత జీవులంతా బాగుండాలి.కాలానికి ఎదురీది నిలబడాలి.
జీతే రహో@Sai_Pallavi9 గారు! pic.twitter.com/ds8njU61DW

— v e n u u d u g u l a (@venuudugulafilm)

సాయిపల్లవి లుక్‌ని పంచుకుంటూ దర్శకుడు వేణు ఉడుగుల చెబుతూ, `ఈ సంక్షోభ సందర్భాన మీకు పుట్టిన రోజు విషెస్‌ చెప్పడం సహేతుకం అనిపించలేదు. అందుకే విరాటపర్వం పోస్టర్‌ని కూడా విడుదల చేయలేదు. మీ అభినయ విశేషముతో ఈ రత్నఖచిత భువనాన తీరొక్క పూల కవనమై వెలుగొందే మీలాంటి హృదయగత జీవులంతా బాగుండాలి. కాలానికి ఎదురీది నిలబడాలి. జీతే రహో సాయిపల్లవి` అని పేర్కొన్నాడు దర్శకుడు. ఇందులో రానా హీరోగా, సాయిపల్లవి హీరోయిన్‌గా, ప్రియమణి, నివేదా పేతురాజ్‌, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడింది.

మరోవైపు నాని హీరోగా రూపొందుతున్న `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రం నుంచి సాయిపల్లవి ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది యూనిట్‌. ఇందులో ఆమె దేవి మాత గెటప్‌లో పూనకాలు క్రియేట్‌చేస్తుంది. ఈ సందర్భంగా సాయిపల్లవికి టీమ్‌ బర్త్ డే విషెస్‌ తెలిజేసింది. అమ్మోరు తల్లి అవతారంలో సాయిపల్లవి లుక్‌ గూస్‌బమ్స్ వచ్చేలా చేస్తుంది. ఈ సినిమాకి రాహుల్‌ సాంక్రిత్యన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

From the Holy ghats of Devi Maatha 🔱

Unfolding the Gracious First look & Wishing our enduring beauty a very Happy Birthday 😊

-Team ❤️ pic.twitter.com/qTIWQPYnkm

— Niharika Entertainment (@NiharikaEnt)
click me!