నేచురల్ బ్యూటీ సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ Pooja Kannan పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఈ సందర్భంగా తాజాగా నిశ్చితార్థపు వేడుక ఘనంగా జరిగింది. ఈ క్రమంలో సాయి పల్లవి వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి Sai Pallavi ఎక్కడ ఉన్న అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. తన అల్లరితో అందరిలో జోష్ నింపుతుంటారు. ఇక ఆమె డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపై స్టార్ హీరోలనే వెనక్కి నెట్టేలా స్టెప్పులేస్తుంది. అంటే తను బేసిక్ గ్గా డాన్సర్ కావడం ఒకరకంగా కారణం. ఇదిలా ఉంటే... ప్రస్తుతం సాయి పల్లవి ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. తన చెల్లి పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతోంది.
సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ Pooja Kannan ఇటీవలనే తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. ప్రియుడు వినీత్ తో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్టు కూడా అప్డేట్ ఇచ్చింది. దీంతో అక్కకు పెళ్లి కాకుండానే చెల్లి పెళ్లిపీటలు ఎక్కుతుండటం విశేషంగా మారింది. మొత్తానికి నిన్న నిశ్చితార్థం Engagement కూడా ఘనంగా జరిగింది. బంధుమిత్రులు ఈ వేడుకకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సాయిపల్లవికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. చెల్లి ఎంగేజ్ మెంట్ లో అక్క సాయిపల్లవి బంధువులతో కలిసి స్టెప్పులేసింది. తన డాన్స్ తో ఆకట్టుకుంది. చెల్లి మూడుముళ్లబంధంలో అడుగుపెట్టబోతున్న సందర్భంగా సంతోషం వ్యక్తం చేసింది. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి మాస్ స్టెప్పులేస్తూ మడతపెట్టేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Vera Level Dance in Her sister's engagement Function 🎊🎉🎇❤ pic.twitter.com/poJ7UjM4uU
— Manjari (@mazhil11)