
సాయి ధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' సినిమా భాక్సాఫీస్ దగ్గర మంచి హిట్టైంది. విడుదలయి మంచి పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత మొదటి సినిమాగా చాలా కష్టపడి చేసిన ఈ చిత్రం ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలంగా వర్కవుట్ అయ్యింది. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించటం ఈ సినిమాకి కలిసొచ్చింది. అలాగే ఈ సినిమాకి సంగీత నేపధ్యం, ఛాయాగ్రహణం కూడా ఫెరఫెక్ట్ గా వర్కవుట్ అయ్యాయి. దాంతో థియేటర్ లో చూద్దామని కుదరక మిగలిన వాళ్ళంతా ఓటిటి రిలిజ్ కోసం ఎదురుచూస్తున్నారు.
నెట్ ఫ్లిక్స్ #Netflix వాళ్ళు ఈ సినిమాని చాలా మంచి రేట్ కి కొన్నారు . 21మే నుంచే స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనున్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించారు.
ఈ సినిమా విడుదలకి ముందు రూ.25 కోట్ల బిజినెస్ చేసింది. ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. 'విరూపాక్ష' సినిమా ఒక కొత్త జానర్ లో దర్శకుడు కార్తీక్ దండు తీసాడు. ఈ సినిమా క్షుద్రశక్తులు, అతీంద్రీయ శక్తులు, చేతబడి లాంటి వాటి మీద ఉంటుంది. దీనికి నేపధ్య సంగీతం, ఛాయాగ్రహణం ఎంతో ఉపకరించి ఈ సినిమాని మంచి హిట్ సినిమాగా తీర్చి దిద్దాయి. సాయి ధరమ్ తేజ్ నటన, అలాగే చివరి 20 నిముషాలు సంయుక్త మీనన్ నటన ప్రతిభతో సినిమా ప్రేక్షకులను కట్టి పడేసింది అని అందువల్ల ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ఈ ఇంటెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని అయితే దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కించగా.. సునీల్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాంతారా సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. తెలుగు మినహా ఇతర భాషల్లో అయితే అయితే ఈ సినిమా అంత సక్సెస్ కాలేకపోయింది. సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ అందించడం విశేషం.