బాలయ్య చేసిన పాత్రలో సాయి తేజ,నప్పుతాడా?

By Surya Prakash  |  First Published Nov 16, 2020, 8:44 AM IST

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ ...శ్రీకృష్ణ దేవరాయులు గా కనపడనున్నారట.  బిందాస్ సినిమాతో డైరెక్టర్ గా అడుగుపెట్టిన వీరు పోట్ల శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి స్టోరీతో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. కృష్ణదేవరాయులు నాటి స్టోరీలైన్ తో  తెలుగులో ఇంతకుముందు సినిమాలు వచ్చాయి. ఆదిత్య 369 సినిమాలో నందమూరి బాలకృష్ణ ఈ పాత్ర చేశాడు. 


సాయి ధరమ్ తేజ హిట్ ,ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా కొత్త తరహా సబ్జెక్టులతో కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. యంగ్ డైరక్టర్స్ కు, విషయం ఉండి సక్సెస్ లేని దర్శకులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన తన తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ సినిమా తర్వాత దేవకట్టాతో ఓ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమాతో పాటే వీరూపోట్ల దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. వివి వినాయిక్ తో ఇంటిలిజెంట్ సినిమా టైమ్ లోనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చి ఇన్నాళ్లకు పట్టాలు ఎక్కుతోంది. ఈ సినిమా వచ్చే సంవత్సరం ఆగస్టు నుంచి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ ...శ్రీకృష్ణ దేవరాయులు గా కనపడనున్నారట.  బిందాస్ సినిమాతో డైరెక్టర్ గా అడుగుపెట్టిన వీరు పోట్ల శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి స్టోరీతో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. కృష్ణదేవరాయులు నాటి స్టోరీలైన్ తో  తెలుగులో ఇంతకుముందు సినిమాలు వచ్చాయి. ఆదిత్య 369 సినిమాలో నందమూరి బాలకృష్ణ ఈ పాత్ర చేశాడు. వీరు పోట్ల సైతం అలాంటి స్టోరీ లైన్ తీసుకున్నాడంటున్నారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ చాలా ఫన్ తో కూడిన పాత్ర చేయబోతున్నారట.

Latest Videos

ఇక ఇప్పటివరకూ తన కెరీర్ లో  సాయి ధరమ్ తేజ్ లో పీరియాడికల్ డ్రామానే చేయలేదు. దాంతో తమ హీరో హిస్టారికిల్ ఫిలిం చేస్తున్నాడంటే అభిమానులు పండగే.  వీరు పోట్ల ఇంతవరకు డైరెక్ట్ చేసిన బిందాస్ - రగడ - ఈడు గోల్డ్ ఎహే సినిమాలు మూడూ కామెడీ ఎంటర్ టెయినర్లే కావటం కలిసొచ్చే అంశం.

click me!