కొత్త దర్శకుడి స్క్రిప్ట్ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగా హీరో

Published : Aug 12, 2019, 03:35 PM ISTUpdated : Aug 12, 2019, 03:36 PM IST
కొత్త దర్శకుడి స్క్రిప్ట్ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగా హీరో

సారాంశం

చిత్రలహరి సినిమాతో మొత్తానికి వరుస అపజయాల నుంచి తప్పించుకున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. తొందరపడకుండా తనకు సెట్టయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ.. నచ్చకపోతే వెంటనే నో చెప్పేస్తున్నాడట.

చిత్రలహరి సినిమాతో మొత్తానికి వరుస అపజయాల నుంచి తప్పించుకున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. తొందరపడకుండా తనకు సెట్టయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ.. నచ్చకపోతే వెంటనే నో చెప్పేస్తున్నాడట. ఇటీవల పదికి పైగా కథలను విన్న సాయి ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథకు ఫిదా అయినట్లు తెలుస్తోంది. 

ఉయ్యాల జంపాల -మజ్ను సినిమాల దర్శకుడు విరించి వర్మ దగ్గర ఇన్నాళ్లు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన సుబ్బు చెప్పిన మోడ్రన్ స్క్రిప్ట్ సాయికి చాలా బాగా నచ్చిందట. అలాగే యాక్టింగ్ స్కిల్స్ బయటపెట్టేందుకు కథలో మంచి స్కోప్ ఉండడంతో తనకు తాను కొత్తగా ప్రజెంట్ చేసుకునేందుకు సినిమా ఉపయోగపడుతుందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. 

ఇక సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్.ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించేందుకు సిద్దమవుతున్నారు. త్వరలోనే ఈ కాంబినేషన్ పై స్పెషల్ ఎనౌన్సమెంట్ రానుంది. ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మారుతి డైరెక్షన్ లో ప్రతి రోజు పండగే అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

మహేష్ బాబు ను హీరోయిన్ ఎంగిలి తాగమన్న దర్శకుడు, కోపంతో షూటింగ్ నుంచి వెళ్లిపోయిన సూపర్ స్టార్..
3700 కోట్ల ఆస్తి, వ్యాపారాలు, 66 ఏళ్ల వయసులో 100వ సినిమా చేస్తోన్న..తెలుగు రిచ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?