
ప్రభాస్ మిర్చి సినిమాతో మొదలైన యువీ క్రియేషన్స్ అతి తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకుంది. వరుస సక్సెస్ లతో ప్రతి హీరోను కలుపుకుంటూ వెళుతోన్న ఈ సంస్థ ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో సినిమా అనంతరం యువీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎక్కువగా చిన్న సినిమాలు రిలీజవుతాయట. అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ సాయి ధరమ్ తేజ్ తో కూడా ఒక సినిమాను నిర్మించనున్నారు. మారుతి దర్శకత్వం వహించనున్న ఆ కామెడీ ఎంటర్టైనర్ ను ముందుగా గీతా ఆర్ట్స్ లో నిర్మించాలని అనుకున్నారు.
అయితే ఇప్పుడు వారితో పాటు యువీ క్రియేషన్ కూడా సాయి సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మారుతి పూర్తీ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో అనుకున్నంతగా హిట్ అందుకోలేకపోయిన మారుతి ఈ సినిమాతో అయినా మంచి సక్సెస్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.