'సాహో' టీజర్ పై ప్రభాస్ పోస్ట్!

Published : Jun 10, 2019, 04:34 PM IST
'సాహో' టీజర్ పై ప్రభాస్ పోస్ట్!

సారాంశం

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడంతో 'సాహో' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడంతో 'సాహో' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2019 మోస్ట్ అవైటెడ్ మూవీస్ జాబితాలో ఈ సినిమా మొదటి జాబితాలో ఉంటుంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

టాలీవుడ్ తో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆగస్ట్ 15న సినిమా విడుదల చేస్తున్నామని అనౌన్స్ చేసిన చిత్రబృందం ప్రమోషన్స్ విషయంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించడం లేదు.

ఇప్పటివరకు పోస్టర్స్ తో సరిపెట్టేయడంతో అభిమానులు కాస్త గుర్రుగా ఉన్నారు. దీంతో వారిని కూల్ చేయడానికి టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి ఈద్ కానుకగా టీజర్ వస్తుందని భావించారు కానీ చిత్రబృందం జూన్ 13న టీజర్ ని విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంది.

ఈ విషయాన్ని ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. జూన్ 14 నుండి థియేటర్ లలో టీజర్ సందడి చేయనుంది. సుజీత డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి