నేను ఇక్కడ ప్రతి ఒక్కరినీ ముద్దుపెట్టుకోవడానికి రాలేదు.. 'RX100' హీరోయిన్ అసహనం!

By Udayavani DhuliFirst Published Aug 20, 2018, 1:32 PM IST
Highlights

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని కొందరు హీరోయిన్లు బహిరంగంగా కామెంట్లు చేస్తుంటే మరికొందరు మాత్రం తమకి అలాంటి పరిస్థితులు ఎదురుకాలేదని అంటున్నారు. అయితే ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చేవారికి మాత్రమే కాదు

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని కొందరు హీరోయిన్లు బహిరంగంగా కామెంట్లు చేస్తుంటే మరికొందరు మాత్రం తమకి అలాంటి పరిస్థితులు ఎదురుకాలేదని అంటున్నారు. అయితే ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చేవారికి మాత్రమే కాదు.. హిట్ ఇచ్చిన హీరోయిన్లకు కూడా కాస్టింగ్ కౌచ్ తిప్పలు తప్పడంలేదని తాజాగా జరిగిన ఓ ఉదంతం ఉదాహరణగా నిలిచింది.

'RX100' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్ ని ఇటీవల ఓ నిర్మాత కలిసి ఆఫర్ ఇస్తా కాంప్రమైజ్ అవుతావా అని ప్రశ్నించిన విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సదరు నిర్మాతను అమ్మడు కొట్టేంత పని చేసిందట. తాజాగా ఈ విషయంపై అమ్మడు అసహనం వ్యక్తం చేస్తోంది.

''RX100 సినిమాతో హిట్ ఇచ్చినా నాకు కాస్టింగ్ కౌచ్ ఎదురుకావడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. RX100 సినిమాలో బోల్డ్ గా నటించినందుకే నాతో ఇలాంటివి ఈజీ అనుకున్నారా..? తెలియడం లేదు. ఈ విషయం నన్ను బాగా డిస్టర్బ్ చేస్తోంది. పైగా నన్ను బోల్డ్ సినిమాల కోసం చాలా మంది సంప్రదిస్తున్నారు. అది సరికాదు.

నేను ఇక్కడ ప్రతి ఒక్కరినీ ముద్దు పెట్టుకోవడానికి రాలేదు.. నటించడానికి వచ్చాను. ఉత్తరాది అమ్మాయిని కాబట్టి ఇన్హిబిషన్స్ కాస్త తక్కువగా ఉంటాయి. అయితే నేను పూర్తిగా ప్రొఫెషనల్ అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి'' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 

ఇది కూడా చదవండి.. 

ఆఫర్ ఇస్తా నాకేంటి అన్నాడు.. RX100 మూవీ హీరోయిన్!

click me!