'RX 100' డైరెక్టర్ నితిన్ కు ఎలాంటి సక్సెస్ ఇస్తాడో..?

Published : Jul 18, 2018, 12:14 PM IST
'RX 100' డైరెక్టర్ నితిన్ కు ఎలాంటి సక్సెస్ ఇస్తాడో..?

సారాంశం

కొత్త టాలెంట్ ను గుర్తుపట్టి ముందుగానే లాక్ చేసే నితిన్.. అజయ్ భూపతి విషయంలో కూడా అదే చేసినట్లు సమాచారం. ఈ మేరకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మీడియాకు హింట్ లు కూడా ఇచ్చాడు

గతవారంలో విడుదలైన 'RX 100' సినిమా ఊహించని విధంగా ఘన  విజయం సాధించింది. ఇప్పటికి రూ.10 కోట్ల షేర్ వసూలు చేసి నిర్మాతలకు లాభాలను మిగిల్చింది. ఈ చిత్ర దర్శకుడు అజయ్ భూపతికి కూడా దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. లిమిటెడ్ బడ్జెట్ లో సినిమా చేసి ఇలాంటి లాభాలను చూపించడంతో ఇప్పుడు నిర్మాతలు, హీరోలు ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఈ క్రమంలో నిర్మాత స్రవంతి కిషోర్ హీరో రామ్ కోసం అజయ్ కు అడ్వాన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సురేష్ బాబు కూడా మూడు సినిమాల కోసం డీల్ కుదుర్చుకునేలా ప్లాన్ చేశాడు. కానీ అజయ్ భూపతి మాత్రం మరో యంగ్ హీరోతో సినిమా చేయాలనుకుంటున్నాడు. అతడే నితిన్. కొత్త టాలెంట్ ను గుర్తుపట్టి ముందుగానే లాక్ చేసే నితిన్.. అజయ్ భూపతి విషయంలో కూడా అదే చేసినట్లు సమాచారం.

ఈ మేరకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మీడియాకు హింట్ లు కూడా ఇచ్చాడు. ప్రస్తుతం నితిన్ 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత 'ఛలో' మూవీ డైరెక్టర్ వెంకీ కుడుములుతో సినిమా చేయనున్నాడు. ఆ తరువాతే అజయ్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. కొద్దిరోజులు గ్యాప్ తీసుకొని అజయ్ భూపతి.. నితిన్ సినిమా వర్క్ మొదలుపెట్టనున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌
Om Shanti Shanti Shantihi Trailer Review: తరుణ్‌ భాస్కర్‌ కి వణుకు పుట్టించిన ఈషా రెబ్బా, ట్రైలర్‌ ఎలా ఉందంటే?