'RX 100' హీరోయిన్ కి మాస్ హీరో ఫోన్!

By Udayavani DhuliFirst Published Oct 30, 2018, 10:25 AM IST
Highlights

కొన్ని నెలల క్రితం 'RX 100' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది నటి పాయల్ రాజ్ పుత్. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ దక్కించుకుంది. దీంతో ఆమెకి వరుస అవకాశాలు వస్తాయని భావించారు కానీ ఊహించినట్లుగా పాయల్ కి ఒక్క పెద్ద హీరో సినిమా ఛాన్స్ కూడా రాలేదు. ఒకట్రెండు చిన్న సినిమాలకు మాత్రమే సైన్ చేసింది. 

కొన్ని నెలల క్రితం 'RX 100' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది నటి పాయల్ రాజ్ పుత్. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ దక్కించుకుంది. దీంతో ఆమెకి వరుస అవకాశాలు వస్తాయని భావించారు కానీ పాయల్ కి ఒక్క పెద్ద హీరో సినిమా ఛాన్స్ కూడా రాలేదు.

ఒకట్రెండు చిన్న సినిమాలకు మాత్రమే సైన్ చేసింది. తాజాగా ఈ బ్యూటీకి మాస్ మహారాజా రవితేజ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. రవితేజ హీరోగా దర్శకుడు విఐ ఆనంద్ ఓ సినిమా రూపొందించనున్నాడు. అందులో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉంది. ఇప్పటికే ఒక హీరోయిన్ గా నభా నటేష్ ని ఎంపిక చేశారు.

ఇప్పుడు మరో హీరోయిన్ గా పాయల్ కి ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా గనుక క్లిక్ అయితే ఈ ఇద్దరు భామలకి టాలీవుడ్ లో అవకాశాలు పెరగడం ఖాయం. విఐ ఆనంద్ తన కథలు కొత్తగా ఉండేలా చూసుకుంటాడు.

అతడి చివరి సినిమా 'ఒక్క క్షణం' సరిగ్గా ఆడనప్పటికీ మంచి ప్రశంసలైతే దక్కాయి. రవితేజ సినిమాతో బ్రేక్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో నటిస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే విఐ ఆనంద్ సినిమా మొదలుకానుంది. 

ఇది కూడా చదవండి.. 

'RX 100' బ్యూటీ అప్పుడే ఫ్లాట్ కొనేసింది!

click me!