రకుల్ కంటే బిచ్చగాళ్ళే నయం.. నెటిజన్ల ట్రోలింగ్!

Published : Oct 30, 2018, 09:59 AM IST
రకుల్ కంటే బిచ్చగాళ్ళే నయం.. నెటిజన్ల ట్రోలింగ్!

సారాంశం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించిన భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా గడుపుతోంది. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను పెడుతూ అభిమానులను ఖుషీ చేస్తుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ ఓ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. మనలో ఉన్న చిన్నపిల్లల మనస్తతత్వాన్ని ఎప్పటికీ అలాగే ఉండనివ్వాలంటూ.. క్యాప్షన్ ఇచ్చి చిరిగిపోయిన డ్రెస్‌  వేసుకున్న ఫోటోని పోస్ట్‌ చేసింది.

అంతే.. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఆమెని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. బికారీ అంటూ కొందరు కామెంట్ చేయగా.. నీకంటే బిచ్చగాళ్ళే నయం మంచి బట్టలు వేసుకుంటారని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కొందరైతే నీ దగ్గర బట్టలు లేకపోతే చెప్పు నేను ఇస్తానంటే మరికొందరు ఒకప్పుడు చిరిగిన బట్టలు వేసుకుంటే పిచ్చోళ్లు అనేవారని ఇప్పుడు వాటినే బ్రాండ్ అంటున్నారని కామెంట్లు చేస్తున్నారు.

రకుల్ వీటిపై స్పందించలేదు కానీ 'నీ జాకెట్ ని ఇంత ఘోరంగా చింపింది ఎవరని' తాప్సీ చేసిన కామెంట్ కి బదులిస్తూ.. 'నాలో ఉన్న చిన్నపిల్ల' అంటూ సమాధానమిచ్చింది. 

PREV
click me!

Recommended Stories

100 సినిమాల్లో 44 ప్లాప్ లు, 30 మూవీస్ రిలీజ్ అవ్వలేదు, అయినా సరే ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?