నాగార్జున ఆరోగ్యంపై పుకార్లు.. అసలు నిజమేంటంటే..?

Published : Aug 28, 2019, 10:05 AM ISTUpdated : Aug 28, 2019, 10:57 AM IST
నాగార్జున ఆరోగ్యంపై పుకార్లు.. అసలు నిజమేంటంటే..?

సారాంశం

తీవ్రమైన వెన్ను నొప్పితో పాటు.. కొన్ని కీళ్ల సమస్యలతో నాగార్జున బాధపడుతున్నాడంటూ నిన్నంతో సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. 

అక్కినేని నాగార్జున ఆరోగ్యం చెడిందని సోషల్ మీడియాలో పుకార్లు వినిపించాయి. దీంతో నాగార్జున తన మనుషుల ద్వారా అభిమానులకు ఓ మెసేజ్ పంపించాడు. కంగారు పడాల్సిన అవసరం లేదని.. నాగార్జునకు వచ్చింది కేవలం వైరల్ ఫీవర్ మాత్రమేనని.. అంతకుమించి ఇంకేం ఆరోగ్య సమస్యలు లేవని వాట్సాప్ గ్రూపుల్లో నిన్నంతా ఈ మెసేజ్ 
చక్కర్లు కొట్టింది.

సీజన్ మారుతున్న సమయంలో జ్వరాలు రావడం సహజం.. కానీ నాగార్జున తనకొచ్చిన జ్వరంపై ఇలా స్టేట్మెంట్ ఇవ్వడానికి బలమైన కారణం ఉంది. 'మన్మథుడు 2' సినిమా కోసం నాగార్జున చాలా కసరత్తులు చేశారు. కాస్త యంగ్ గా కనిపించడానికి డైట్ ఫాలో అయ్యారు. ఎక్సర్ సైజ్ మోతాదు కూడా బాగా పెంచాడు.

ఆ సమయంలో నాగార్జున చేతికి గాయం కూడా అయింది. ఇవన్నీ ఆయన ఆరోగ్యాన్ని దెబ్బ తీశాయని పుకార్లు వినిపించాయి. తీవ్రమైన వెన్నుపోటుతో పాటు కీళ్ల సమస్యలతో నాగార్జున బాధపడుతున్నాడంటూ నిన్న సోషల్ మీడియాలో పుకార్లు వినిపించాయి.

ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా ఈ పుకార్లు విని భయపడ్డారు. దీంతో నాగార్జున స్వయంగా తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఫ్యాన్ గ్రూప్ లో షేర్ చేయించాడు. తనకు జ్వరం తప్ప మరేమీ లేదని స్పష్టం చేశాడు. 

PREV
click me!

Recommended Stories

డ్రింక్ తాగు, పార్టీ చేసుకో.. ప్రొటెక్షన్ మాత్రం మర్చిపోకు.! క్రేజీ హీరోయిన్‌కి తల్లి బోల్డ్ సలహా
2025 Missed Heroines: ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని 8 మంది హీరోయిన్లు, 2026లో వీరిదే హవా