Guppedantha Manasu: రిషి,వసు లకు శోభనం ఏర్పాట్లు చేస్తున్న దేవయాని.. సంతోషంలో వసుధార?

By Navya ReddyFirst Published Mar 21, 2023, 7:38 AM IST
Highlights

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు మార్చి 21వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో వసుధార,రిషి ఇద్దరు కారు లో వెళ్తుండగా నేను ఏమి ఆలోచిస్తున్నాను అని అడగరా సార్ అని అడగగా నువ్వు ఏం ఆలోచిస్తే నాకెందుకు అనగా నేను మీ గురించి ఆలోచిస్తున్నాను సార్ అంటుంది. నా గురించి ఏం ఆలోచిస్తున్నావు అనగా మీరు మా ఎండీ కదా సార్ అని అంటుంది. ఏం ఎండీ ని కాదు అని అంటాడు రిషి. కాబట్టి భరించు అంటే ఇప్పుడు అదే కదా సార్ చేస్తున్నాను ఎక్కడో చదివాను భరించి వాడే భర్త అని కానీ మన విషయంలో రివర్స్ ఉంది అంటూ సెటైర్లు వేస్తూ ఉంటుంది వసుధార. అయినా నాకు ఈ నెల శాలరీ తొందరగా వస్తే మేలు సార్ అనగా రాలేదా ఇంకా అనగా రాలేదు సార్ అంటుంది.

అయినా డబ్బుతో నీకేం పని అనగా నాకు పెళ్లి అయింది కదా సార్ ఖర్చులు ఉంటాయి కదా అని అంటుంది. సర్ ఒక్క నిమిషం కార్ ఆపండి సార్ మిర్చి బజ్జి తిందాం అనక నా దగ్గర డబ్బులు లేవు అనడంతో నాతో ఉన్నాయి సార్ మిర్చి బజ్జికి ఎంత పదో, ఇరవై ఖర్చు అవుతాయి సార్ అని అంటుంది. ఇప్పుడు రిషికి మిర్చి బజ్జి తినడం ఇష్టం లేక నాకు డాక్టర్స్ మిర్చి బజ్జి తినవద్దు అని ని చెప్పారు అంటూ వెటకారంగా మాట్లాడతాడు రిషి. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నామా సార్ అనడంతో అవును అనగా అలా కాకుండా లాంగ్ డ్రైవ్ వెళ్దామా సార్ అనడంతో అదేం లేదు ఇంటికి వెళ్ళాలి అని అంటాడు రిషి.

ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తుండగా నాకు ఒక్కటే కాదు ధరణి అందరికీ సమానంగా వడ్డించు అని అంటుంది దేవయాని. అప్పుడు ధరణి నువ్వు కూడా కూర్చోమ్మా అని దేవయాని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు దేవయాని ధరణికి వడ్డించడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని వసుధార మీ అమ్మా నాన్నలను రమ్మని చెప్పు అని అనడంతో రిషి ఆశ్చర్యపోతాడు. ఎందుకు అక్కయ్య అని జగతి అనడంతో పెళ్లయిన తర్వాత మిగతా తంతులు అని పూర్తి చేయాలి కదా అని అంటుంది. మేడం ఇప్పుడు అవన్నీ వద్దు అనగా చూసావా నన్ను ఇంకా మేడం అంటున్నావు అంటే ఇంకా మన మధ్య ఎంత దూరం ఉందో అని అంటుంది.

అప్పుడు రిషి వద్దు పెద్దమ్మ అనగా ఈ విషయంలో నేను ఎవరి మాట వినను భూషణ్ ఫ్యామిలీకి మర్యాదలు తెలియవు అని అందరూ అనుకోరా అని అంటుంది. ఏంటి జగతి నువ్వు ఏమి మాట్లాడవు వారు పెళ్లి చేసుకున్నారు మిగతావన్నీ నేను పెద్దవాళ్ళుగా మనం చూడాలి కదా అని అంటుంది. ఏం రిషి నువ్వు ఏమంటావు అనగా రిషి తినకుండా భోజనంలో చేతులు కడిగేసి వెళ్ళిపోతాడు. అప్పుడు వసు కూడా తినకుండా వెళ్లిపోతుంది. జగతిలో తృప్తిగా తిని నీ కొడుకు చెప్పు జగతి అంటూ వెటకారంగా మాట్లాడుతుంది దేవయాని. ఆ తర్వాత జగతి మహేంద్ర ఇద్దరు రూమ్ లోకి వెళ్లి జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత వసు అక్కడికి వస్తుంది.

మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు వసు. మనకు కొన్ని ఆచారాలు సంప్రదాయాలు కట్టుబాట్లు ఉన్నాయి. దేవయాని అక్కయ్య అన్నట్టు వాటన్నింటినీ విడిచిపెట్టి మీరిద్దరూ ఎన్ని రోజులని ఉంటారు అంటుంది జగతి. నాదేముంది మేడం అనడంతో సమస్య మీ ఇద్దరితో అయినప్పుడు ఇద్దరి కలిసి వెతుక్కోవాలి కదా అని అంటుంది జగతి. అన్న గారిని పిలిచి మాట్లాడదామా అనగా మనం ఏం చెప్పినా మా నాన్న ఓకే అంటారు.  ముందు రిషి సార్ నిర్ణయం ఏంటో తెలుసుకోవాలి అని అంటుంది వసు. ఒకసారి మీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటే సరిపోతుంది వసుధార అని అంటుంది జగతి. అప్పుడు వసు బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనుకుంటూ ఉండగా ఇంతలోనే వసుధారకు మెలకువ రావడంతో బయటకు వస్తుంది.

ఏంటి సార్ ఇక్కడికి వచ్చారు నాతో ఏమైనా మాట్లాడాలా అనగా ఏదో శబ్దం అయితే వచ్చాను అనడంతో అదా పిల్లి శబ్దం అయ్యుంటుంది సార్ అని అంటుంది. అప్పుడు వారిద్దరూ పిల్లి గురించి ఫన్నీగా వాదించుకుంటూ ఉంటారు. మనిద్దరి మధ్య గోడలు మాత్రమే అడ్డంగా ఉన్నాయి సార్. దూరం అనగా దూరం అనకు వసుధార కేవలం భారం మాత్రమే ఉంది అని అంటాడు రిషి. అప్పుడు రిషి మనసులో మనిద్దరికీ సంబంధించి అన్ని ఆలోచిస్తావు చేస్తావు ఆ ఒక్క విషయంలో ఎందుకు అలా చేశావు వసుధార అనుకుంటూ ఉంటాడు. పెద్దమ్మ అన్న మాటల గురించి ఏమైనా అడగాలి అనుకుంటున్నావా అని అడుగుతాడు రిషి.

click me!