ఎట్టకేలకు బయటకొచ్చిన RRR

Published : Mar 05, 2019, 06:10 PM IST
ఎట్టకేలకు బయటకొచ్చిన RRR

సారాంశం

గత కొన్ని నెలలుగా ఒకే ప్లేస్ లో జక్కన్న టీమ్ బిజీగా ఉంది. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న మల్టీస్టారర్ RRR హైదరాబాద్ లో వేసిన ఒక స్పెషల్ సెట్ లో రెండు షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి సారి ఈ బడా ప్రాజెక్ట్ షూటింగ్ పక్క రాష్ట్రాలకి తరలిపోతోంది. 

40 రోజుల వరకు కలకత్తాలో షూటింగ్ నిర్వహించడానికి నెక్స్ట్ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్నారు. గ్యాప్ లేకుండా ఇద్దరు హీరోలు అలాగే మరికొంత మంది నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ అయిపోగానే మళ్ళీ యధావిధిగా హైదరాబాద్ షెడ్యూల్ కి చిత్ర యూనిట్ రానుంది. 

డివివి. దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమాలో హీరోయిన్స్ గురించి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక తారక్ ను బాలీవుడ్ మీడియాకు త్వరలోనే పరిచయం చేయాలనీ జక్కన్న ప్రణాళికలు రచిస్తున్నారు.   

PREV
click me!

Recommended Stories

Salman Khan Fee: దిల్ రాజుతో సినిమా, సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ లో భారీ కోత.. ఎందుకో తెలుసా
Dhandha Review: దందా రివ్యూ.. చిన్న మోసాల నుంచి పొలిటీషియన్స్ వరకు, నయా క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?