ఎన్టీఆర్ ఎంట్రీకి ఫిదా అయిన హాలీవుడ్ ఆడియన్స్... ట్రెండింగ్ లో తారక్ ఆర్ఆర్ఆర్ వీడియో

Published : Jul 20, 2022, 12:42 PM IST
ఎన్టీఆర్ ఎంట్రీకి ఫిదా అయిన హాలీవుడ్ ఆడియన్స్... ట్రెండింగ్ లో తారక్ ఆర్ఆర్ఆర్ వీడియో

సారాంశం

బాహుబలి తరువాత అంతకు మించి అన్నట్టు జక్కన్న చెక్కిన శిల్ప ట్రిపుల్ ఆర్. ఈమూవీ వరుసగా రికార్డ్స్ ను తిరగరాస్తోంది. తాజాగా ఈమూవీ నుంచి ఎన్టీఆర్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ట్రెండింగ్ లో ఉంది. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో  మల్టీస్టారర్ గా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా  భారీ విజయన్ని సాధించి మరో సారి మన టాలీవుడ్ సత్తా ఏంటో అటు ప్రపంచానికి. .ఇటు బాలీవుడ్ కు గట్టిగా చాటి చెప్పింది. దాదాపు 1100 కోట్ల కలెక్షన్లని వసూలు చేసింది ట్రిపుల్ ఆర్. ఈ సినిమా మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా ఈ సినిమాకి ఫిదా అయిపోయారు ప్రేక్షకులు. 

ఇక RRR సినిమా ఓటీటీలో విడుదల అయ్యాక ఇంకా  మరింత పేరు సంపాదించింది. ఇటు ఇండియాతో పాటు అటు విదేశీ ప్రేక్షకులు కూడా థియేటర్ లో చూడలేనివారు ఓటీటీలో  చూసి తెగ మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఫారెనర్స్ కు  ఈ సినిమా తెగ నచ్చేసింది. వివిధ దేశాల్లోని ప్రేక్షకులతో పాటు హాలీవుడ్ సినీ పరిశ్రమని ఆర్ఆర్ఆర్  మెప్పించింది. హాలీవుడ్ రచయితలు, టెక్నీషియన్స్ RRR సినిమాని పొగుడుతూ ట్వీట్స్ చేశారు. మరికొంత మంది గే సినిమా అంటూ నెగెటీవ్ కామెంట్స్ కూడా చేశారు. 

పెద్ద సినిమా అన్న తరువాత పాజటీవ్ కామెంట్స్ తో పాటు నెగెటీవ్ కామెంట్స్ కూడా తప్పవు. ముఖ్యంగా మన టాలీవుడ్ మూవీస్ కు అవి అలవాటే. హాలీవుడ్ దాకా ఎందుకు బాలీవుడ్ లోనే గతంలో మన సినిమాలను చీప్ గాతీసి పడేసే వారు.. ఇప్పుడు  మన సినిమాలను ఆకాశానికి ఎత్తుతున్నారు. మన సినిమాల ముందు బాలీవుడ్ ఎప్పుడో చిన్నబోయింది. అయితే ఇప్పటికీ మన సినిమాలను విమర్షించే వారు బాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. ఇటు తమిళ్,కన్నడా వారు కూడా టాలీవుడ్ తో పోటీపడాలని చూస్తున్నారు. 

ఇక  తాజాగా RRR సినిమా మరోసారి వైరల్ అవుతుంది. ఇందులోని ఎన్టీఆర్ వీడియో ట్రెండ్డింగ్ లో ఉంది. ట్రిపుల్ ఆర్ లో  తారక్ బ్రిటీష్ వారి మీదకు దాడి చేయడానికి ట్రక్కులో జంతువులను తీసుకువెళ్లిన వీడియో ఆడియన్స్ కు తెగ నచ్చేసింది.  ఒక ట్రక్కులో పులులు, ఎలుగుబంట్లు, జింకలు, నక్కలతో తారక్‌ ఇచ్చే వైల్డ్‌ ఎంట్రీ సీన్‌ ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికి తెలిసిందే. ఈ సీన్ చూసి థియేటర్లో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అయితే ఈ వీడియో ఫారెన్ వారిని విశేషంగా ఆకట్టుకుంటుంది. 

 

 

రీసెంట్ గా  ఓ విదేశీ ప్రేక్షకుడు ఈ సీన్‌ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసి.. నేను ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు చూశాను. 29 మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలు కూడా చూశాను. కానీ ఇప్పటి వరకు ఇలాంటి అద్భుతమైన ఎంట్రీ సీన్ ఏ సినిమాలో చూడలేదు అని పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అయి మరింతమంది దీనిపై ట్వీట్స్ చేశారు. అతి తక్కువ సమయంలో ట్విట్టర్లో ఈ వీడియో 12 మిలియన్‌ వ్యూస్‌ను సాధించింది. గత రెండు రోజుల నుంచి ఈ వీడియో, ఎన్టీఆర్ పేరు, RRR ట్విట్టర్లో మారుమ్రోగిపోతుంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా