తాజాగా Naked సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు వర్మ. ఆర్జీవీ మార్క్ కెమెరా యాంగిల్స్‌తో రూపొందించిన ఈ ట్రైలర్‌లో ఓ రేంజ్‌లో అందాల ప్రదర్శనతో నింపేశాడు. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగా చాలా సన్నివేశాల్లో ఆర్టిస్ట్‌లను నగ్నంగా చూపించినట్టుగా అర్ధమవుతోంది.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ కాలాన్ని కూడా ఓ రేంజ్‌లో వాడేస్తున్నాడు. ఇప్పటికే లాక్ డౌన్ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసిన క్లైమాక్స్ మూవీని ఇటీవల ఓటీటీ ద్వారా రిలీజ్ చేశాడు. 100 రూపాయల టికెట్ తో రిలీజ్ చేసిన ఈ సినిమాతో కోట్లు సంపాదించాడు ఆర్జీవీ. ఆ సినిమాతో పాటు వైరస్ పేరుతో లాక్ డౌన్ కాలంలో కరోనా నేపథ్యంలో ప్రపంచంలోనే తొలి చిత్రాన్ని తెరకెక్కించాడు. త్వరలో సినిమా రిలీజ్ కానుంది.
తాజాగా మరో మూవీని రెడీ చేశాడు ఆర్జీవీ. నెక్డ్ పేరుతో రూపొందించిన ఈ సినిమాను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు వర్మ. ఆర్జీవీ మార్క్ కెమెరా యాంగిల్స్‌తో రూపొందించిన ఈ ట్రైలర్‌లో ఓ రేంజ్‌లో అందాల ప్రదర్శనతో నింపేశాడు. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగా చాలా సన్నివేశాల్లో ఆర్టిస్ట్‌లను నగ్నంగా చూపించినట్టుగా అర్ధమవుతోంది.
ఈ సినిమా ట్రైలర్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసి వర్మ `నేను రాజమౌళి కాదు.. ఇది ఆర్ ఆర్ ఆర్ కాదు. కానీ నేను నేనే ఇది NNN.` అంటూ కామెంట్ చేశాడు. క్లైమాక్స్ సినిమాకు అగస్త్య మంజును దర్శకుడిగా చెప్పిన వర్మ, నెక్డ్ కు మాత్రం తానే దర్శకుడిగా చెప్పుకుంటున్నాడు. మేకింగ్‌లో వర్మ మార్క్ కనిపించినా.. కంటెంట్ పరంగా మరోసారి వర్మకు విమర్శలు తప్పేలా కనిపించటం లేదు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు 200 రూపాయల ధరను నిర్ణయించాడు వర్మ. మరి వర్మ ఈ సారైనా ఆకట్టుకుంటాడేమో చూడాలి.