వర్మకు భారతరత్న ఇవ్వాలని నా డిమాండ్.. 'RX100' డైరెక్టర్!

Published : Aug 18, 2018, 03:56 PM ISTUpdated : Sep 09, 2018, 01:38 PM IST
వర్మకు భారతరత్న ఇవ్వాలని నా డిమాండ్.. 'RX100' డైరెక్టర్!

సారాంశం

తాజాగా అయన తన ట్విట్టర్ లో తన గురువు వర్మకి 'భారత రత్న' అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లుగా ట్వీట్ చేశారు. దీంతో ట్విట్టర్ లో ఓ ఆసక్తికర చర్చ నడిచింది. ఈ పోస్ట్ పై స్పందించిన RX100 సినిమా హీరో కార్తికేయ.. గురువులానే శిష్యుడు కూడా అంటూ కామెంట్ చేశాడు

'RX100' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి మొదటి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అజయ్ భూపతి.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేశాడు. అతడిపై వర్మ ప్రభావం చాలా వరకు ఉందనే చెప్పాలి. బయట కూడా వర్మలానే కొన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అయన తన ట్విట్టర్ లో తన గురువు వర్మకి 'భారత రత్న' అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లుగా ట్వీట్ చేశారు.

దీంతో ట్విట్టర్ లో ఓ ఆసక్తికర చర్చ నడిచింది. ఈ పోస్ట్ పై స్పందించిన RX100 సినిమా హీరో కార్తికేయ.. గురువులానే శిష్యుడు కూడా అంటూ కామెంట్ చేశాడు. ఇక కొందరు నెటిజన్లు వర్మ ట్వీట్లకు స్పందించిన విధంగా.. 'ఎన్నో పెగ్గు మాస్టారూ' అంటూ కామెంట్ చేయగా..

మరికొందరు మాత్రం అజయ్ భూపతిని సపోర్ట్ చేస్తూ వర్మ నిజంగానే గొప్ప ఫిలిం మేకర్.. ఇండస్ట్రీలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆ వ్యక్తికి సినీ రంగానికి అందించిన సేవలకు గాను భారతరత్నకి అర్హుడే అంటూ మద్దతు తెలిపారు. మరి ఈ వ్యవహారం వర్మ వరకు వెళ్తుందేమో చూడాలి! 

 

PREV
click me!

Recommended Stories

Nani Paradise Aaya Sher Song: యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది !
Rachita Ram: డింపుల్ క్వీన్ రచితా రామ్ ఇంత ఫేమస్ ఎలా అయ్యింది? ఆ సీక్రెట్ ఇదే!