స్టార్ హీరోయిన్ పెళ్లిలో మొదటి అంకం!

Published : Aug 18, 2018, 02:54 PM ISTUpdated : Sep 09, 2018, 11:50 AM IST
స్టార్ హీరోయిన్ పెళ్లిలో మొదటి అంకం!

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చాలా కాలంగా హాలీవుడ్ నటుడు, సింగర్ నిక్ జోనాస్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చాలా కాలంగా హాలీవుడ్ నటుడు, సింగర్ నిక్ జోనాస్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి సన్నిహితంగా మెలగడం, బయట పార్టీలకు కలిసి అటెండ్ అవ్వడం వంటి విషయాలు వీరిలో ప్రేమలో ఉన్నారని కన్ఫర్మ్ చేశాయి. రీసెంట్ గా వీరికి నిశ్చితార్ధం కూడా జరిగిందని సమాచారం. ఇప్పుడు పెళ్లితో ఈ జంట ఒక్కటి కాబోతుందని తెలుస్తోంది.

ఇప్పటివరకు తమ బంధం గురించి ప్రియాంక పెదవి విప్పకపోయినా తాజాగా సోషల్ మీడియాలో కనిపిస్తోన్న ఫోటోలను బట్టి ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తోంది. సాంప్రదాయక పంజాబీ పెళ్లిలో మొదటగా జరిపే రోకా వేడుకలో ప్రియాంక, నిక్ జోనాస్ కలిసి కనిపించారు. ఈ పూజలో ఇద్దరూ సాంప్రదాయ దుస్తులు ధరించారు. సాధారణంగా ఈ వేడుకకు బయట వారిని అనుమతించరు.

అందుకే సైలెంట్ గా జరిపినట్లు తెలుస్తోంది. నిక్ తల్లితండ్రులు, ప్రియాంక కుటుంబ సభ్యులు ఆమె కజిన్ పరిణితి చోప్రా ఇలా అతి తక్కువ మంది సమక్షంలో వేడుక పూర్తి చేశారు. ఈ వేడుకలో భాగంగా ఈరోజు సాయంత్రం ప్రియాంక గ్రాండ్ పార్టీ కూడా ఇవ్వబోతున్నారు,. దీనికి బాలీవుడ్ నుండి పలువురు సెలబ్రిటీలు హాజరు కానున్నారు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?