
సినీ నటి, దర్శకురాలు, సోషల్ యాక్టివిస్ట్ అయిన రేణు దేశాయ్ హైకోర్టు మెట్లెక్కారు. హైదరాబాద్ లో ఆక్వా మెరైన్ పార్క్ ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగర శివార్లలోని కొత్వాల్ గూడలో ఆక్వా మెరైన్ పార్క్, పక్షిశాల ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఆక్వా మెరైన్ పార్క్ ను ఏర్పాటు చేయడం వల్ల ప్రకృతి విధ్వంసం జరుగుతుందంటూ హైకోర్టులో ఆమె ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అంతే కాదు ఆమెతో పాటు.. మరికొందరు సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో హైకోర్ట్ మెట్లు ఎక్కారు. వారంతా రేణుదేశాయ్ తో కలిసి పోరాటం చేస్తున్నారు.
ఇక ఈ ఆక్వా మెరైన్ పార్క్ ను ఆపాలంటూ పోరాడుతున్న సెలబ్రిటీలలో హీరోయిన్ సదా, శ్రీ దివ్య, డైరెక్టర్ శశికిరణ్ తిక్కా తదితరులు కూడా ఉన్నారు.ఏటువంటి పర్యావరణ అధ్యయనం లేకుండా చేపట్టిన ఈ అక్వా మెరైన్ పార్క్ కట్టడం ఆపేయాలంటూబకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంలో సెలబ్రిటీలు మాట్లాడుతూ ఇలా అన్నారు. వేలాది జలచరాల మనుగడకు దీని ద్వారా ముప్పు వస్తుందని.. ఆక్వా మైరైన్ పార్క్ లు పర్యావరణాన్ని దెబ్బ తీస్తాయని వెల్లడించారు. వాటిని ఆహ్లాదం కోసం మనముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో చాలా చనిపోతాయని, కృత్రిమంగా ఏర్పాటు చేసిన లైట్స్ లో వాటి జీవనం అత్యంత బాధాకరంగా మారుతుందన్నారు. వేల గ్యాలన్ల నీటితో నడిచే ఈ ఆక్వా పార్కులు నీటి సమస్యకు కారణం అవుతాయని అంటున్నారు.
అంతే కాదు చాలా దేశాలు ఇప్పటికే ఈ పార్కుల నిర్మాణాలు వ్యాతిరేకించినట్టు గుర్తు చేశారు. ఇలాంటి పార్కుల నిర్మాణాలు చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతే కాదు మూడు వేల గ్యాలన్ల నీటితో నిర్మాణం అయ్యే ఇలాంటి ఆక్వా పార్కులు నీటి సమస్యను మరింత పెంచుతాయని ఆమె అన్నారు. సహాజంగా సముద్రాలలో పెరిగే జలచరాలును పట్టి కృత్రిమంగా నిర్మించే ఇలాంటి పార్కులలో ఉంచడం వాటి ప్రాణాలకే ప్రమాదమని తెలిపారు.