సోనూసూద్‌ మరో అఛీవ్‌మెంట్‌.. రియల్ హీరో ఫాలోయింగ్‌కిది నిదర్శనం..

Published : Aug 24, 2021, 05:35 PM IST
సోనూసూద్‌ మరో అఛీవ్‌మెంట్‌..  రియల్ హీరో ఫాలోయింగ్‌కిది నిదర్శనం..

సారాంశం

గతేడాది నుంచి సోనూసూద్‌ వార్తల్లో నిలుస్తుంది. ఎక్కడ చూసినా ఆయన గురించిన చర్చే జరుగుతుంది. ప్రతి రోజులు ట్విట్టర్ వేదికగా అనేక విషయాలను పంచుకుంటున్నారు సోనూసూద్‌. సహాయం చేయడానికి కూడా సోషల్‌ మీడియాని ప్రధాన సాధనంగా వాడుకుంటున్నారు.

రియల్‌ హీరో సోనూసూద్‌ గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. 2020కి ముందు హిందీ, తెలుగులో పలు సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించిన సోనూ సూద్‌ కేవలం కొద్ది మందికి తెలుసు. ఆయన్ని ఓ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆయన్ని సినిమాలకు అతీతంగా చూస్తున్నారు. గొప్ప సేవా భావం కలిగిన వ్యక్తిగా భావిస్తున్నారు. పార్టీలకు, కుల మతాలకు అతీతంగా ఆయన్ని ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. 

కరోనా సమయంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. వలస కార్మికులను ఆదుకోవడం, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం, కరోనాతో పోరాడుతున్న వారికి ఆక్సిజన్‌ అందించడం, ఆక్సిజన్‌ బెడ్స్ అందించడంలో సహాయం చేయడం, వెంటిలేటర్స్ బెడ్స్ ఇప్పించడం, అంతేకాదు ఏకంగా ఆక్సిజన్‌ ప్లాంట్లనే ఏర్పాటు చేయడం చేస్తున్నారు. కేవలం కరోనాకి సంబంధించిన సహాయాలు మాత్రమే కాదు, విద్య, వైద్యం వంటి వాటిలోనూ తనవంతు సాయం అందిస్తున్నారు. 

ఈ క్రమంలో గతేడాది నుంచి సోనూసూద్‌ వార్తల్లో నిలుస్తుంది. ఎక్కడ చూసినా ఆయన గురించిన చర్చే జరుగుతుంది. ప్రతి రోజులు ట్విట్టర్ వేదికగా అనేక విషయాలను పంచుకుంటున్నారు సోనూసూద్‌. సహాయం చేయడానికి కూడా సోషల్‌ మీడియాని ప్రధాన సాధనంగా వాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు భారీ ఫాలోయింగ్‌ ఏర్పడింది. అందులో భాగంగా ఓ అఛీవ్‌మెంట్‌ సాధించారుసోనూసూద్‌. హీరోలకు మించిన సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకున్నారు. ట్విట్టర్‌లో ఆయన 9 మిలియన్స్‌ ఫాలోవర్స్ ని దాటడం విశేషం. 

ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, విజయ్‌ దేవరకొండ వంటి క్రేజీ హీరోలకు మించిన ఫాలోయింగ్‌ సోనూసూద్‌ సొంతమైందని చెప్పొచ్చు. ఓ రకంగా ఇదొక అఛీవ్‌మెంట్‌గా చెప్పొచ్చు. ఆయన చేస్తున్న సేవనే ఆయన్ని మరింత మందికి దగ్గర చేస్తుందని చెప్పొచ్చు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం
సుమ కు బాలకృష్ణ భారీ షాక్, అఖండ 2 దెబ్బకు 14 సినిమాలు గల్లంతు..?