సీనియర్ నిర్మాత తనయుడు హీరోగా 'ఒకటే లైఫ్'

Published : May 02, 2019, 08:18 PM IST
సీనియర్ నిర్మాత తనయుడు హీరోగా 'ఒకటే లైఫ్'

సారాంశం

సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్ బి. చౌదరి తనయుడు జితన్ రమేష్ కథానాయకుడిగా తెరపై గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యాడు.

సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్ బి. చౌదరి తనయుడు జితన్ రమేష్ కథానాయకుడిగా తెరపై గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యాడు. గత కొంత కాలంగా చౌదరి తనయుడు ఎంట్రీపై అనేక రకాల కథనాలు వచ్చాయి. స్టార్ దర్శకుడు రమేష్ ని డైరెక్ట్ చేయబోతున్నట్లు టాక్ వచ్చింది. 

అయితే ఫైనల్ గా ఒకటే లైఫ్ అనే చిన్న సినిమాతో సింపుల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రీసెంట్ గా మంత్రి హరీష్ రావ్ చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా యొక్క ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ఇక సినిమాను ఈ నెల 3న రిలీజ్ కానుంది. సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ను జారీ చేసింది. 

టెక్నాలిజీ మోజులో పడి హ్యూమన్ రిలేషన్స్ ని ఎమోషన్స్ ని మరచిపోతున్న యువతకు మంచి సందేశాన్ని అందించే విద్గంగా సినిమాను తెరకెక్కించినట్లు దర్శకుడు వెంకటేష్ తెలిపారు. ఇక రీసెంట్ గా సెన్సార్ యూనిట్ నుంచి కూడా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందని అన్నారు. అదే విధంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా నిర్మించిన ఈ సినిమాలో నేపథ్యం సంగీతం మేజర్ ప్లస్ పాయింట్ అని వివరించారు.

PREV
click me!

Recommended Stories

వాలెంటైన్స్ డే స్పెషల్ .. ఫిబ్రవరి 13న రిలీజ్ అవ్వబోతున్న నిలవే సినిమా
Renu Desai : నాకంటూ ఎవరు లేరు, ఎవరికి చెప్పుకోలేను, పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఎమోషనల్ కామెంట్స్