ఏంటీ 'రజాకార్‌' టీజర్ రచ్చ, కేటీఆర్ ఏం చేయబోతున్నారు?

Published : Sep 19, 2023, 04:46 PM IST
 ఏంటీ  'రజాకార్‌' టీజర్ రచ్చ, కేటీఆర్ ఏం చేయబోతున్నారు?

సారాంశం

తెలంగాణ రాజకీయాల్లో రజాకార్ దుమారం రేపుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఈ మూవీతో మరో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది.


ఒక టీజర్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రచ్చ లేపుతోంది. పీరియాడిక్ డ్రామా గా చెప్పబడుతున్న ' రజాకార్ ' సినిమా టీజర్ విడుదల అయ్యినప్పటి నుంచీ సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో వివాదాల తుఫానును రేకెత్తిస్తోంది.  ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రజాకార్ దుమారం రేపుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఈ మూవీతో మరో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది.ఈ సినిమా విషయమై ఇప్పటికే కేటీఆర్ స్పందించారు. ఆయన ఏం చర్యలు తీసుకోబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

 తాజాగా విడుదలైన టీజర్‌లో.. ఇస్లాం మతాన్ని ప్రచారం చేయడం, 'టర్కిస్థాన్' స్థాపన కోసం రజాకార్లు హిందువులపై చేసిన అకృత్యాలను చిత్రీకరించారు.  లేటెస్ట్గా ఈ మూవీ టీజర్ పై మంత్రి కేటీఆర్(KTR) ట్వీట్ చేస్తూ.. కొంతమంది తెలివి తక్కువ బీజేపీ జోకర్లు.. వాళ్ల స్వార్థ రాజకీయాల కోసం.. తెలంగాణలో మత విద్వేషాలు సృష్టించాలని చాలా కష్టపడతున్నారని కేటీఆర్ తెలిపారు. రజాకార్ సినిమా విషయంలోనూ అదే జరుతోందని.. దీన్ని తాము సెన్సార్ బోర్డ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పుకొచ్చారు. తెలంగాణ పోలీస్‌లు కూడా లా అండ్ ఆర్డర్ పరిస్థితి దెబ్బతినకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా..ఇప్పుడు ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ మూవీ రిలీజ్కు ముందే వివాదాలు ప్రారంభం అవ్వగా.. ఇంకా ఎలాంటి మార్పులు జరుగుతాయో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. .
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని..అందులో భాగంగానే రజాకార్ సినిమాను నిర్మిస్తున్నారని మజ్లిస్ బచావో తెహ్రీక్ అధికార ప్రతినిధి అమ్జద్ ఉల్లా ఖాన్ తెలిపారు. 75 ఏళ్లకు పైగా జరిగిన సంఘటనల ఆధారంగా  రజాకార్  చిత్రాన్ని రూపొందించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి సినిమాల వల్ల సమాజంలో  మరింతగా చీలిక వస్తుందని... సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ఆమోదం తెలపబోదన్నారు.  ప్రజలను రెచ్చగొట్టే సినిమాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.  హింసను సృష్టించడం.. శాంతి, మత సామరస్యాన్ని కాపాడుకోవడంపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం సీరియస్‌గా ఉంటే, సినిమా విడుదలకు ముందే నిషేధించాలని ఆయన అన్నారు.

హైదరాబాద్​సంస్థానంలోని రజాకార్ల దురాగతాల గురించి బయటకు తెలియని పలు విషయాలను ఈ సినిమా కథలో చిత్రీకరించినట్టు టీమ్ చెప్తోంది. అందరికీ వాస్తవాలు ముందుంచాలనే లక్ష్యంతో రజాకార్ సినిమా తీసినందుకు అభినందించారు బండి సంజయ్. నిజాం-రజాకార్ల పాలనను స్వర్ణ కాలంగా పేర్కొంటున్నారని మండిపడ్డారు. అయితే, రజాకార్ సినిమాపై ముస్లిం మత పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్దేశ పూర్వకంగా నరహంతకులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 1948 నాటి ఘటనలను తప్పుగా చిత్రీకరించి బీజేపీ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి మద్దతుతో రూపొందిన ' రజాకార్ ' సినిమా టీజర్‌ను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. లాంచ్ ఈవెంట్ సందర్భంగా, సస్పెండ్ చేయబడిన బిజెపి నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ ఈ చిత్రాన్ని ' ది కాశ్మీర్ ఫైల్స్ ', ' ది కేరళ స్టోరీ ' చిత్రాలతో పోల్చారు . "భారత స్వాతంత్ర్య పోరాటంలో హైదరాబాద్ మారణకాండ, ప్రత్యేకంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని జరిగిన విషాద సంఘటనలపై దృష్టి సారించి 'రజాకార్' అనే పేరుతో ఒక అద్భుతమైన చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించి, విజయానికి సహకరించాలని ప్రజలను కోరుతున్నాను" అని టి రాజా సింగ్ హిందీలో ట్వీట్ చేశారు.

తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కూడా ఈ సినిమా టీజర్‌ను ట్విట్టర్ లో పంచుకున్నారు. “రజాకార్ సినిమా ట్రైలర్‌ని చూసి అక్షరాలా గూస్‌బంప్స్ వచ్చింది.. హైదరాబాద్ విమోచన పోరాటాల గురించి ప్రస్తుత తరాలు తెలుసుకోవాలి. చరిత్రతో నిమగ్నమవుదాం. వారి నకిలీ మేధావులు దానిని చెరిపివేయడానికి ప్రయత్నించినప్పటికీ," అని రాశారు.
 
మరోవైపు ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ వంటి సినిమాల్లో ముస్లిం సమాజాన్ని ఓ బూచిగా, టెర్రరిస్టులుగా చిత్రీకరించారనే విమర్శులు వెల్లువెత్తాయి. ఇప్పుడు తెలంగాణలో రజాకార్లపై తీసిన సినిమాలోనూ అట్లాంటి మరో ప్రయత్నమే చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 1948 సమయంలో నిజాం ప్రభుత్వం కుప్పకూలిపోయిన తర్వాత పోలీస్ యాక్షన్ లాంటి పరిస్థితిని చిత్రకరిస్తూ.. ముస్లింలే పెద్ద నేరస్తులుగా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నారని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి.
 
హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.. ప్రైవేట్ ఆర్మీ రజాకార్లు.. రజాకార్లు అంటే స్వచ్ఛంద సేవకులు అని అర్థం.. రజాకార్లు నిజాం రాజుతోపాటు.. ముస్లీం లీగ్, బ్రిటీష్-ఆక్రమిత దళాధిపతులకు సహచరులుగా ఉండేవారు. 1938లో బహదూర్ యార్ జంగ్ MIM ప్రెసిడెంట్ గా ఎన్నికైన క్రమంలో.. రజాకార్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించారు.. రజాకార్లు అంటే శాంతిని వాంచించే ‘స్వచ్ఛంద సేవకులు’ అని అర్థం.. మతపరమైన భావాజాలంతో ఏర్పడిన ప్రైవేటు సైన్యం రజకార్లు.. ముస్లిం లీగ్ తో పాటు, బ్రిటీష్-ఆక్రమిత భారత దళాధిపతుల సహచరులుగా పనిచేసేవారు.1944 లో బహదూర్ యార్ జంగ్ మరణించిన తరువాత, సయ్యద్ ఖాసిమ్ రజ్వి నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రజాకార్ల స్వరూపమే మారిపోయింది. ప్రజలపై దాడులు చేయడంతోపాటు రజకార్లు వేలాది మందిని పొట్టనబెట్టుకున్నారని చరిత్రకారులు చెబుతారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: ఎన్టీఆర్ కి చుక్కలు చూపించిన కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి, టాలీవుడ్ మొత్తం షేక్
Kriti Sanon: అల్లు అర్జున్‌పై మహేష్‌ బాబు హీరోయిన్‌ ఇంట్రెస్ట్