
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రాజకీయంగా ఎంత బిజిగా ఉన్నప్పటికీ, తన అభిమానులకు నిరాశ కలిగించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. తక్కువ టైంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్ ప్లాన్‌తో బిజీ షెడ్యూల్ రెడీ చేసుకున్నాడు. అటు సినిమా,ఇటు రాజకీయాలతో ఫుల్ బిజీ షెడ్యూల్స్ తో గడుపుతున్నారు పవన్ కల్యాణ్ . ఇంత బిజీలోనూ ఆయన తన నిర్మాత కోసం ఓ ఫేవర్ చేయనున్నారని తెలుస్తోంది. అదేమిటంటే తన నిర్మాత ఏఎం రత్నం కోసం ఓ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాబోతున్నారట.
కిరణ్ అబ్బవరం హీరోగా నిర్మాత రత్నం తనయుడు జ్యోతికృష్ణ రూపొందించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. అక్టోబరు 6న సినిమా రిలీజ్ కానుండగా ప్రమోషన్ కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీ రిలీజ్‌కు గెస్ట్ గా పవన్ కళ్యాణ్ ని తీసుకురాబోతున్నట్లు సమాచారం. తాను గెస్ట్ గా రావటం ద్వారా సినిమాకు హైప్ తీసుకొచ్చేందుకు తన వంతు సాయం చేయనున్నారట. ఏఎమ్ రత్నం ప్రెజెంటర్. ఇదే పవన్ రావడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. దర్శకుడు ఏఎమ్ రత్నం తనయుడే కావడం విశేషం. అయితే పవన్ స్టేజిపై ఏమన్నా పొలిటికల్ కామెంట్స్ చేస్తారా అనే ఆసక్తి ఓ వర్గంలో క్రియేట్ అవుతోంది. అయితే పవన్ సినిమాని, రాజకీయాలు రెండు కలపటానికి ప్రయత్నించరు కాబట్టి అలా జరగకపోవచ్చు అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన ఈ సినిమాలో మెహర్ చాహల్ రెండో హీరోయిన్. 'వెన్నెల' కిశోర్, 'హైపర్' ఆది, సుబ్బరాజు, 'వైవా' హర్ష (హర్ష చెముడు), అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, 'నెల్లూరు' సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కళా దర్శకత్వం : ఎం. సుధీర్, కూర్పు : వరప్రసాద్, ఛాయాగ్రహణం : దులీప్ కుమార్, సహ నిర్మాత : రింకు కుక్రెజ, సంగీత దర్శకుడు: అమ్రిష్ గణేష్.