Raviteja Khiladi update: రవితేజ ఖిలాడి అప్డేట్... 'ఫుల్ కిక్' ఇచ్చే సాంగ్ వచ్చేస్తుంది

Published : Jan 19, 2022, 03:27 PM IST
Raviteja Khiladi update: రవితేజ ఖిలాడి అప్డేట్... 'ఫుల్ కిక్' ఇచ్చే సాంగ్ వచ్చేస్తుంది

సారాంశం

రవితేజ (Raviteja)ఖిలాడి గా థియేటర్స్ ని కుమ్మేయడానికి సిద్ధం అవుతున్నాడు. క్రాక్ మూవీ విజయంతో ఊపు మీదున్న రవితేజ వరుసగా సినిమాలు ప్రకటించారు. అలాగే ఖిలాడి చిత్రాన్ని చకచకా పూర్తి చేశాడు. కాగా ఖిలాడి చిత్రం నుండి లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

మాస్ మహరాజ్ రవితేజ క్రాక్ (Krack)మూవీతో సాలిడ్ కమ్ బ్యాక్ అయ్యాడు. 2021 సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. దర్శకుడు  గోపిచంద్ మలినేని అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. క్రాక్ మూవీ ఇచ్చిన ఊపులో రవితేజ ఖిలాడి స్టార్ట్ చేశాడు. నెలల వ్యవధిలో చకచకా పూర్తి చేశారు. అన్నీ కుదిరితే గత ఏడాది సమ్మర్ కే ఖిలాడి విడుదల కావాల్సి ఉంది. సెకండ్ వేవ్ కారణంగా అన్ని చిత్రాల విడుదలతో పాటు ఖిలాడి సైతం వాయిదా పడింది. 

సంక్రాంతి బరిలో పెద్ద చిత్రాలున్నాయని ఖిలాడి (Khiladi)విడుదలకు సన్నద్ధం కాలేదు. చివరి నిమిషంలో ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ వాయిదా పడడంతో చేసేదేమీ లేక... ఫిబ్రవరికి 11న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక విడుదలకు కేవలం 20రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ విరివిగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖిలాడి చిత్రం నుండి నాలుగవ సింగిల్ విడుదల కానుంది. 

రిపబ్లిక్ డే వేడుకను పురస్కరించుకొని జనవరి 26న ఖిలాడి నుండి 'ఫుల్ కిక్...' (Fullkick) అనే నాలుగవ సాంగ్ విడుదల చేస్తున్నారు. ఈ మేరకు ప్రకటన చేయడం జరిగింది. ఖిలాడి చిత్రానికి దేవీశ్రీ సంగీతం అందిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, పెన్ స్టూడియో సంయుక్తంగా ఖిలాడి చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

కాగా హీరోయిన్ డింపుల్ హయాతి ఈ మధ్య కరోనా బారినపడ్డారు. ఆమె ఐసొలేట్ కావడంతో పాటు ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఖిలాడి తర్వాత రవితేజ నుండి వరుసగా చిత్రాలు రానున్నాయి. రామారావు, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు, రవాణాసుర చిత్రాలలో రవితేజ నటిస్తున్నారు. ఇవన్నీ ఏక కాలంలో షూటింగ్ జరుపుకుంటున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

Allu Aravind: పవన్‌ కళ్యాణ్‌ వెండితెరకు పరిచయమై 30ఏళ్లు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ నోట్‌
Rajinikanth Villain Movies: రజనీకాంత్‌ విలన్‌గా విశ్వరూపం చూపించిన టాప్ 5 మూవీస్‌.. సూపర్‌ స్టార్‌ కావడానికి ముందు