మాస్‌ కాంబో రవితేజ-గోపీచంద్‌ మలినేని నాల్గో సినిమా గ్రాండ్‌ ఓపెనింగ్‌..

Published : Oct 26, 2023, 02:37 PM IST
మాస్‌ కాంబో రవితేజ-గోపీచంద్‌ మలినేని నాల్గో సినిమా గ్రాండ్‌ ఓపెనింగ్‌..

సారాంశం

దసరాకి `టైగర్‌ నాగేశ్వరరావు`తో డిజాస్టర్ ని చవి చూసిన రవితేజ ఇప్పుడు మరో సినిమాని ప్రారంభించారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో చేస్తున్న మూవీ గురువారం ప్రారంభమైంది.

రవితేజ, గోపీచంద్‌ మలినేనిలది టాలీవుడ్‌లో హిట్‌ కాంబినేషన్‌. ఇంకా చెప్పాలంటే ఊర మాస్‌ కాంబినేషన్‌. ఇప్పటి వరకు హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టారు. ఇప్పుడు మరో హ్యాట్రిక్‌ కోసం రెడీ అవుతున్నారు. ఈ కాంబినేషన్‌లో నాల్గో సినిమా రాబోతుంది. బుధవారం ఈ సినిమాకి సంబంధించిన కాస్ట్ అండ్‌ క్రూని ప్రకటించారు. నేడు గురువారం సినిమాని ప్రారంభించారు. 

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రం నేడు ప్రారంభమైంది. అతిథిగా వచ్చిన ప్రముఖ దర్శకుడు వినాయక్‌ రవితేజ, సెల్వ రాఘవన్‌, ఇందుజలపై క్లాప్‌ కొట్టారు. ఇందులో దర్శకుడు సెల్వరాఘవన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందుజ పవర్‌ ఫుల్‌ రోల్‌ చేస్తుందట. వీరితోపాటు థమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జీకే విష్ణు కెమెరామెన్‌గా, ఏఎస్‌ ప్రకాష్‌ ఆర్ట్ డైరెక్టర్‌గా, నవీన్‌ నూలి ఎడిటర్‌గా, సాయి మాధవ్‌ బుర్రా రైటర్‌గా వర్క్ చేస్తున్నారు. 

త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ ప్రారంభం కాబోతుందట. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుందని సమాచారం. ఇక ఇటీవల దసరాకి `టైగర్‌ నాగేశ్వరరావు` చిత్రంతో సందడి చేశాడు రవితేజ. ఇందులో స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు పాత్రలో కనిపించారు మాస్‌ రాజా. పాత్ర పరంగా ఆయన ఆకట్టుకున్నా, సినిమా మెప్పించలేకపోయింది. లెంన్త్ కారణంగా, బలమైన కాన్‌ఫ్లిక్స్ లేకపోవడం వల్ల సినిమా ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడి టేకింగ్‌ మైనస్‌. టెక్నీకల్‌గా బాగున్నా, కంటెంట్‌ పరంగా మెప్పించలేకపోయింది. పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. త్వరలో రవితేజ `ఈగల్‌` చిత్రంతో రాబోతున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీని సంక్రాంతికి తీసుకొచ్చే అవకాశం ఉందట. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ