Latest Videos

రవితేజ ల్యాండ్ మార్క్ మూవీలో హీరోయిన్ గా శ్రీలీల! ధమాకా కాంబో రిపీట్

By Sambi ReddyFirst Published Jun 11, 2024, 1:24 PM IST
Highlights

వరుస పెట్టి చిత్రాలు చేస్తున్నాడు హీరో రవితేజ. జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు దూసుకుపోతున్నారు. నేడు ఆయన ల్యాండ్ మార్క్ మూవీ స్టార్ట్ చేశాడు. మరోసారి శ్రీలీలతో జతకడుతున్నారు. ఈ చిత్ర దర్శకుడు, నిర్మాతలు ఎవరో చూద్దాం... 
 

క్రాక్ తో ఫార్మ్ లోకి వచ్చిన రవితేజ... వరుస పరాజయాలు ఎదుర్కొన్నాడు. ధమాకాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ధమాకా అనంతరం చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య మూవీలో ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేశాడు. 2023 సంక్రాంతి కానుకగా విడుదలైన ధమాకా భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. కాగా రవితేజ హీరోగా నటించిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. టైగర్ నాగేశ్వరరావు మీద రవితేజ చాలా ఆశలే పెట్టుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఆ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. 

ఈ ఏడాది ఈగల్ అంటూ ప్రేక్షకులను పలకరించాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ సైతం పూర్తి స్థాయిలో మెప్పించలేదు. ప్రస్తుతం దర్శకుడు హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. కాగా నేడు రవితేజ 75వ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. హైదరాబాద్ లో ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. 

ధమాకా కాంబో మరోసారి రిపీట్ అవుతుంది. రవితేజ సరసన శ్రీలీల నటిస్తుంది. నేటి పూజా కార్యక్రమంలో రవితేజ, శ్రీలీలతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. #RT75 చిత్రానికి భాను భోగవరపు దర్శకుడు. రచయితగా పలు హిట్ చిత్రాలకు పని చేసిన భాను భోగవరపు దర్శకుడిగా మారుతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. 

ఫ్యాన్స్ కోరుకునే విధంగా మాస్ అండ్ కామెడీ యాంగిల్స్ కలగలిపి రవితేజ పాత్రను దర్శకుడు తీర్చిదిద్దాడని సమాచారం. ధమాకాతో హిట్ కొట్టిన రవితేజ-శ్రీలీల జంటను మరోసారి సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు ఆడియన్స్ సైతం ఆసక్తి చూపుతున్నారు. 11 జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ధమాకా కు అదిరిపోయే బీట్స్ అందించిన భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. 

click me!