Latest Videos

మర్డర్ కేసులో స్టార్ హీరో అరెస్ట్.. ప్రియురాలి కోసం ఇంత ఘాతుకమా!

By Sambi ReddyFirst Published Jun 11, 2024, 11:50 AM IST
Highlights

మర్డర్ కేసులో స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. తన ప్రియురాలికి అసభ్యకర, బెదిరింపు సందేశాలు పంపిన ఓ వ్యక్తిని దర్శన్ మర్డర్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 


కన్నడ సూపర్ స్టార్ దర్శన్ తూగుదీప ని మైసూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన రేణుక స్వామి అనే వ్యక్తి దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ్ కి అసభ్యకర, బెదిరింపు సందేశాలు పంపినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన దర్శన్ తన మనుషులతో అతడిని హత్య చేయించాడు. రెండు రోజుల క్రితం కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలో గల సుమన్నహళ్లి బ్రిడ్జ్ వద్ద గుర్తు తెలియని మృతదేహం వెలుగు చూసింది. మృతుడు చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల రేణుక స్వామిగా పోలీసులు గుర్తించారు. 

విచారణలో ఈ మర్డర్ తో హీరో దర్శన్ కి సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. మంగళవారం దర్శన్ తో పాటు మరో పది మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. దర్శన్ ప్రియురాలికి రేణుక స్వామి అసభ్యకర సందేశాలు పంపిన నేపథ్యంలో అతన్ని కామాక్షిపాళ్యలో గల ఓ షెడ్ లో చిత్రహింసలకు గురి చేశారు. అనంతరం చంపి సుమన్నహళ్లి బ్రిడ్జి వద్ద పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

దర్శన్ కెరీర్ బిగినింగ్ లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. 2001లో విడుదలైన మాజెస్టిక్ చిత్రంతో హీరో అయ్యాడు. పలు హిట్ చిత్రాల్లో నటించి కన్నడ స్టార్ అయ్యాడు. దర్శన్ గత చిత్రం కాటేరా కన్నడలో భారీ విజయం సాధించింది. కాగా నటి పవిత్ర గౌడకు చాలా కాలంగా దర్శన్ సన్నిహితంగా ఉంటున్నాడు. దర్శన్ భార్య శ్రీలక్ష్మి-పవిత్ర గౌడ మధ్య మాటల యుద్ధం నడిచింది. పవిత్ర గౌడ కారణంగా ఈసారి దర్శన్ అతిపెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు. 

click me!