పందిపిల్లతో పాదయాత్ర: ప్రమోషన్ బాగానే వర్కౌట్ అయ్యింది!

Published : Nov 02, 2018, 06:49 PM IST
పందిపిల్లతో పాదయాత్ర: ప్రమోషన్ బాగానే వర్కౌట్ అయ్యింది!

సారాంశం

డిఫరెంట్ సినిమాలను చేయాలంటే సినిమా రిలీజ్ కాకముందే ఆడియెన్స్ బాగా ఆకర్షించాలి. ప్రమోషన్స్ లో భాగంగా ప్రస్తుతం చాలా మంది సినీ ప్రముఖులు చాలా రకాలుగా వారి స్టైల్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. 

డిఫరెంట్ సినిమాలను చేయాలంటే సినిమా రిలీజ్ కాకముందే ఆడియెన్స్ బాగా ఆకర్షించాలి. ప్రమోషన్స్ లో భాగంగా ప్రస్తుతం చాలా మంది సినీ ప్రముఖులు చాలా రకాలుగా వారి స్టైల్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. రీసెంట్ గా రవిబాబు కూడా తనదైన శైలిలో పందిపిల్లతో పాదయాత్రను చేశారు. 

పంది పిల్లను ముఖ్య పాత్రగా చేసుకొని రవిబాబు అదుగో అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా నవంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా రవిబాబు పంది పిల్లను జనాల్లోకి తెచ్చేశారు. నేడు కేబీఆర్ పార్క్ వద్ద చిత్ర యూనిట్ తో కలిసి సందడి చేశారు.

ఫిల్మ్ ఛాంబర్ వరకు బంటి పాత్రను పోషించిన పందిని తీసుకెళ్లారు. ప్రమోషన్ కి సంబందించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే ఓ వర్గం ప్రేక్షకుల్లో చూడాలనే ఆసక్తి కలిగింది. అదుగో సినిమా కోసం దాదాపు మూడేళ్ళుగా రవిబాబు కష్టపడ్డారు. ఫైనల్ గ చిత్రాన్ని దీపావళి సందర్బంగా సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో రిలీజ్ చేస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్