`గీతగోవిందం` హిట్‌ సెంటిమెంట్‌ రిపీట్‌ చేస్తున్న విజయ్‌ దేవరకొండ, రష్మిక.. హింట్‌ ఇచ్చిన నేషనల్‌ క్రష్‌

Published : Nov 27, 2023, 10:00 AM IST
`గీతగోవిందం` హిట్‌ సెంటిమెంట్‌ రిపీట్‌ చేస్తున్న విజయ్‌ దేవరకొండ, రష్మిక.. హింట్‌ ఇచ్చిన నేషనల్‌ క్రష్‌

సారాంశం

`గీతగోవిందం`, `డియర్‌ కామ్రేడ్‌` చిత్రాల్లో కలిసి నటించారు విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా. ఇప్పుడు మరోసారి కలిసి సందడి చేయబోతున్నారు. అదే చాలా `స్పెషల్` అంటోంది రష్మిక.

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి ఇప్పటికే `గీత గోవిందం`, `డియర్‌ కామ్రేడ్‌` చిత్రంలో నటించారు. తొలి చిత్రం బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. ఇద్దరిని స్టార్లని చేసింది. ఆ తర్వాత నటించిన `డియర్‌ కామ్రేడ్` మెప్పించలేదు. కానీ ఈ ఇద్దరి మధ్య ప్రేమకి కారణమైంది. ఆ తర్వాత ఈ ఇద్దరు తరచూ కలుసుకోవడం జరుగుతుంది. పండగలకు విజయ్‌ ఇంటికి రష్మిక వస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ జంట డీప్‌గా డేటింగ్‌లో ఉంది. 

ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి సినిమాలో కలిసి నటించబోతున్నారట. అయితే గౌతమ్‌ తిన్ననూరి మూవీలో శ్రీలీల స్థానంలో రష్మికని తీసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పుడు మరో సినిమాలో ఈ ఇద్దరు కలిసి కనిపించబోతున్నారు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ.. `గీతగోవిందం` లాంటి హిట్‌ ఇచ్చిన పరశురామ్‌ దర్శకత్వంలో `ఫ్యామిలీ స్టార్‌` అనే సినిమా చేస్తున్నారు. శరవేగంగా ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. 

ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌. అయితే ఆమెతోపాటు రష్మిక కూడా నటిస్తుందట. ఓ ప్రత్యేకమైన పాత్రలో రష్మిక కనిపించబోతుందని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ ఢిల్లీలో జరుగుతుంది. షూటింగ్‌ స్పాట్‌ నుంచి మృణాల్‌ ఠాకూర్‌ ఓ ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ఫ్యామిలీ స్టార్‌ నైట్‌ షూట్‌ అంటూ తెలిపారు. అయితే రష్మిక మందన్నా కూడా అదే షూటింగ్‌ లొకేషన్‌ నుంచి ఓ ఫోటోని పోస్ట్ చేశారు. `ఢిల్లీ నైట్‌ షూట్‌కి అవసరమైనవి, సమ్‌థింగ్‌ స్పెషల్‌షూటింగ్‌ జరుగుతుంది. త్వరలో చెబుతా` అని పేర్కొంది. 

ఈ రెండింటిని బట్టి చూస్తే `ఫ్యామిలీ స్టార్`లో రష్మిక స్పెషల్‌ రోల్లో కనిపించబోతుందని తెలుస్తుంది. అయితే నిజంగానే ఇది ప్రత్యేకమైన పాత్రనా లేక స్పెషల్‌ సాంగా? అనేది  క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతికి `ఫ్యామిలీ స్టార్‌`ని విడుదల చేయాలని భావిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌