
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. అద్భుతమైన నటనతో ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. `ఛలో`, `గీత గోవిందం`, `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ`, `పుష్ప` చిత్రాలతో మంచి ఫ్యాన్స్ బేస్‌ని ఏర్పాటు చేసుకుంది రష్మిక మందన్నా. మరోవైపు హిందీలోకి వెళ్లాక నార్త్ ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. సౌత్, నార్త్ లోనూ ఆడియెన్స్ కి దగ్గరయిన రష్మికకి సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ వేరే లెవల్.
రష్మిక మందన్నా పంచుకునే సినిమా అప్‌డేట్లు, తన హాట్ ఫోటో షూట్ల ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రష్మిక హద్దులు చెరిపే అందాల విందు మరింతగా ఆకట్టుకుంటున్నాయి. తన ఫాలోయింగ్‌ని పెంచుతున్నాయి. ఇలా ప్రస్తుతం ఇన్‌స్టాలో ఈ బ్యూటీకి దాదాపు 36 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అంటే మూడున్నర కోట్ల మంది ఈ బ్యూటీని కదలికలను గమనిస్తున్నారు.
మరోవైపు `పుష్ప` చిత్రంలో శ్రీవల్లిగా ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ పాటకి దేశ విదేశాల్లోనూ రీమిక్స్ చేస్తూ, రీల్స్ చేస్తూ పోస్టు లు పెడుతూ తమ అభిమానాన్ని, సినిమా ఎంతగా నచ్చిందో అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. కానీ ఓ అభిమాని రష్మికకి ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్ చేశారు. అది ఆమె ఎప్పుడూ ఊహించి లేదు. ఇది అభిమానులతో పంచుకుంటూ తన ఆనందాన్ని షేర్ చేసింది రష్మిక మందన్నా.
ఆ వివరాలు చూస్తే, ఓ అభిమాని రష్మిక ఓ ఫ్లవర్ బొకే గిఫ్ట్ ని పంపించాడు. అయితే బొకే సీతాకోకచిలుకల డిజైన్‌లో ఉంది. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. అంతేకాదు అందులో చిన్న నోట్‌ని పంపించాడు. అందులో రష్మిక మందన్నాకి అని ఇంగ్లీష్, హిందీలో ఆమె పేర్లు రాశాడు. ఇది ఆమెని అభిమానించే అభిమానుల్లో అత్యంత ప్రేమించే ఓ అభిమాని అని పేర్కొన్నాడు. అయితే అది పంపించింది యూకే కి చెందిన వాళ్లు కాగా, అందులో తన పేరు కూడా మెన్షన్ చేయలేదు సదరు ఫ్యాన్.
అదే ఇప్పుడు రష్మిక హృదయాన్ని కదిలించింది. హార్ట్ కి కనెక్ట్ అయ్యింది. ఆమె చెబుతూ, ఈ గిఫ్ట్ ని ఈ రోజు నేను పొందాను. ఈ గిఫ్ట్ నా హృదయాన్ని కదిలించింది. ఇందులో పేరు లేదు, కానీ ఇది ఎవరైనా వారిని నేను ఎప్పటికీ ప్రేమిస్తుంటాను. నువ్వు నిజంగా నాలో సంతోషాన్ని నింపావు, బిగ్ టెడ్డీ బేర్ హగ్స్ టూ యూ` అని పేర్కొంది. ఇన్‌స్టా స్టోరీస్‌లో రష్మిక ఈ పోస్ట్ పంచుకుని ఆ అభిమానికి తన సంతోషాన్ని, తన ప్రేమని తెలియజేసింది. ఇది నెట్టింట వైరల్ అవుతుంది.
రష్మిక మందన్నా ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో `పుష్ప2`లో నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. మరోవైపు హిందీలో `యానిమల్` మూవీ చేస్తుంది. కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందట.