రష్మిక అదృష్టం మామూలుగా లేదుగా..?

Published : Feb 07, 2021, 09:55 AM ISTUpdated : Feb 07, 2021, 10:17 AM IST
రష్మిక అదృష్టం మామూలుగా లేదుగా..?

సారాంశం

 మరో భారీ ఆఫర్ రష్మిక పాకెట్ లోకి వచ్చి చేరిందని వార్తలు వస్తున్నాయి. ఏకంగా స్టార్ హీరో విజయ్ సరసన ఆమెకు అవకాశం వచ్చిందని సదరు వార్తల సారాంశం. హీరో విజయ్ తన తదుపరి చిత్రం దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. 

అనతి కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రష్మిక మందాన. ఆమె సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఇక బాలీవుడ్ లో కూడా ఓ ఆఫర్ పట్టేసింది రష్మిక మందాన. తాజాగా మరో భారీ ఆఫర్ రష్మిక పాకెట్ లోకి వచ్చి చేరిందని వార్తలు వస్తున్నాయి. ఏకంగా స్టార్ హీరో విజయ్ సరసన ఆమెకు అవకాశం వచ్చిందని సదరు వార్తల సారాంశం. హీరో విజయ్ తన తదుపరి చిత్రం దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. 

ఈ మూవీలో ఓ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్నారని సమాచారం. కాగా ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ కి అవకాశం ఉండగా... మరో హీరోయిన్ గా రష్మిక మందాన ఎంపికయ్యారట. ఈ విషయంపై చర్చలు కూడా పూర్తయ్యాయని కోలీవుడ్ మీడియా టాక్. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం తెలుగులో రష్మిక పుష్ప మూవీలో నటిస్తున్నారు. 

దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా పలు భాషలలో విడుదల కానుంది. ఇటీవలే ఏపీలోని ఏజెన్సీ ఏరియాలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. అలాగే కార్తీ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ మూవీలో కూడా రష్మిక హీరోయిన్ గా చేశారు.

PREV
click me!

Recommended Stories

ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు లలో అసలైన ధనికులు ఎవరు ? ఆయనొక్కరే రియల్ స్టార్
Alia Bhatt AI Images: అలియా భట్‌ ఫేక్ ఫోటోలతో పాకిస్థాన్ లో దారుణం, స్టార్స్ కి తలనొప్పిగా AI టెక్నాలజీ..