బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసిన ఆర్ ఆర్ ఆర్.. జక్కన్నా మజాకా!

Published : Feb 07, 2021, 08:05 AM IST
బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసిన ఆర్ ఆర్ ఆర్.. జక్కన్నా మజాకా!

సారాంశం

ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్ లో బాహుబలి 2ని కూడా మించిపోయిందట. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ రూ . 500కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపిందని సమాచారం అందుతుంది.

దర్శకధీరుడు రాజమౌళి ఇద్దరు టాప్ స్టార్స్ ఎన్టీఆర్, చరణ్ తో చేస్తున్న ప్రయోగాత్మక పీరియాడిక్ మూవీ ఆర్ ఆర్ ఆర్. చరిత్రలో వీరులుగా పేరొందిన కొమరం భీమ్, అల్లూరి పాత్రలను తీసుకొని ఫిక్షన్ జోడించి ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ విడుదల అనుకున్న సమయానికంటే ఏడాదికి పైగా ఆలస్యం అయ్యింది. రెండు మార్లు ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదాపడగా, అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు కొత్త తేదీ ప్రకటించిన విషయం తెలిసిందే. 

అయితే ఆర్ ఆర్ ఆర్ అప్పుడే రికార్డుల మోత మొదలుపెట్టిందని వార్తలు వస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్ లో బాహుబలి 2ని కూడా మించిపోయిందట. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ రూ . 500కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపిందని సమాచారం అందుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్, కన్నడ మరియు మలయాళ భాషలకు గానూ రూ. 350కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. అలాగే హిందీ వర్షన్ ద్వారా మరో రూ. 100 కోట్లు దక్కాయట. 

అలాగే ఓవర్సీస్ హక్కులు రూ. 70కోట్లకు పైగా అమ్ముడుబోయాయట. అలా మొత్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే ఆర్ ఆర్ ఆర్ రూ. 500 కోట్ల మార్క్ దాటివేసింది అంటున్నారు. బాహుబలి 2 ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోల్చితే ఇది చాలా ఎక్కువని సమాచారం. ఆ విధంగా ఆరంభంలోనే ఇండియన్ టాప్ గ్రాసర్ గా ఉన్న బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసిందని అంటున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Padma Awardsపై మురళీ మోహన్‌, రాజేంద్రప్రసాద్‌ ఎమోషనల్‌ కామెంట్‌.. చిరంజీవి సత్కారం
Ranabaali: పూనకాలు తెప్పించేలా విజయ్‌ దేవరకొండ `రణబాలి` టైటిల్ గ్లింప్స్, స్వాతంత్య్రానికి ముందు నాటి చీకటి కోణాలు