
ప్రస్తుతం 'ధురంధర్ 2' సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్... కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. అందులో 'కాస్టింగ్ కౌచ్' లాంటి భయంకరమైన అనుభవాలు కూడా ఉన్నాయి. అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో తనకు ఎదురైన సవాళ్ల గురించి రణ్‌వీర్ సింగ్ ఓ పాత ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అప్పట్లో తను కొత్త కావడంతో, అవకాశాల కోసం రకరకాల వ్యక్తులను కలవాల్సి వచ్చేదని చెప్పాడు.
ఓ ఇంటర్వ్యూలో రణ్‌వీర్ మాట్లాడుతూ, ఒక కాస్టింగ్ ఏజెంట్ తనను ఇంటికి పిలిచాడని చెప్పాడు. అతడిని 'చాలా నీచమైన వ్యక్తి' అని అభివర్ణించాడు. రణ్‌వీర్ తన పోర్ట్‌ఫోలియోను అతడికి ఇవ్వగా, దాన్ని కనీసం చూడకుండా పక్కన పడేశాడట. ఆ తర్వాత, 'ఇండస్ట్రీలో రాణించాలంటే 'స్మార్ట్‌గా', 'సెక్సీగా' ఉండాలి' అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ప్రొఫెషనల్‌గా కాకుండా, చాలా అసభ్యంగా ప్రవర్తించాడు` అని చెప్పాడు.
ఆ మాటలకు రణ్‌వీర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడట. `ఏం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు. 'ముందు ముట్టుకోనివ్వు', 'ఆ తర్వాత చూడనివ్వు' అంటూ ఆ ఏజెంట్ మాట మారుస్తూ బతిమాలాడ`ని రణ్‌వీర్ చెప్పాడు. కానీ, రణ్‌వీర్ దీనికి 'నో' చెప్పేశాడు. తను ఒప్పుకోకపోవడంతో ప్రేమికుడి గుండె పగిలినట్టు ఆ ఏజెంట్ చాలా బాధపడిపోయాడట.
ఆ తర్వాత రణ్‌వీర్‌కు తెలిసిన విషయం ఏంటంటే, అదే ఏజెంట్ మరో స్ట్రగ్లింగ్ యాక్టర్‌తో కూడా ఇలాగే ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. అప్పుడే అతనికి అర్థమైంది, ఇండస్ట్రీలో ఇది చాలా మంది ఎదుర్కొంటున్న ఓ చేదు నిజమని. మరో సందర్భంలో మాట్లాడుతూ, ఆ సమయంలో తనమైండ్‌లో రకరకాల ఆలోచనలు వచ్చాయని రణ్‌వీర్ చెప్పాడు. అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలా, అతడికి గట్టిగా సమాధానం చెప్పాలా, లేక కోపం ప్రదర్శించాలా అని ఆలోచించానన్నాడు.
ఈ మొత్తం అనుభవాన్ని రణ్‌వీర్ ఓ పాఠంగా మార్చుకున్నాడు. దాన్ని ఒక 'యాక్టింగ్ ఎక్సర్‌సైజ్'లా చూశాడు. భవిష్యత్తులో ఎప్పుడైనా అలాంటి పాత్ర చేయాల్సి వస్తే, ఈ అనుభవాన్ని వాడుకోవాలని అనుకున్నాడు. ఆ క్యారెక్టర్‌ను ఆ ఏజెంట్ ప్రవర్తన ఆధారంగానే డిజైన్ చేస్తానని చెప్పాడు. ఇది ఒక `క్రేజీ ఎక్స్ పీరియెన్స్` అని రణ్‌వీర్ అన్నాడు.
ఇప్పుడు రణ్‌వీర్ సింగ్ ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన లేటెస్ట్ సినిమా 'ధురంధర్ 2' విడుదలైన వారంలోనే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలో ఆయన నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.