నిర్మాతలు ఒప్పుకుంటే రంగస్థలం 2 రెడీ..సుకుమార్

Published : Apr 03, 2018, 08:10 PM IST
నిర్మాతలు ఒప్పుకుంటే రంగస్థలం 2 రెడీ..సుకుమార్

సారాంశం

నిర్మాతలు ఒప్పుకుంటే రంగస్థలం 2 రెడీ..సుకుమార్

 

రంగస్థలం సినిమా క్లయిమాక్స్ లో విలన్ ను చంపిన తర్వాత హీరో రామ్ చరణ్, హీరోయిన్ సమంత.. ఎమోషనల్ గా అలా నడుచుకుంటూ వెళ్లిపోతుంటారు. అక్కడ శుభం కార్డు పడిపోతుంది. ఓ పెద్ద రాజకీయ నాయకుడ్ని చంపిన తర్వాత చరణ్ ఎక్కడికెళ్తాడు? పోలీసులు అతడి కోసం వెతకలేదా..? రామ్ చరణ్ కుటుంబం ఏమైంది? ఇలా ఎన్నో ప్రశ్నలు అలానే మిగిలిపోయాయి. వీటన్నింటినీ టచ్ చేస్తూ రంగస్థలం సినిమాకు సీక్వెల్ తీయొచ్చనే డిస్కషన్ కూడా మొదలైంది. దీనిపై దర్శకుడు సుకుమార్ కూడా స్పందించాడు.

"రంగస్థలం-2తీద్దామనే ఐడియా ఉంది. ఓ చిన్న స్టోరీలైన్ కూడా అనుకున్నాను. నిజానికి ఈ సినిమాకు సీక్వెల్ తీయాలనే ప్లాన్ ముందు నుంచే నాకుంది. కానీ ఆర్య, ఆర్య-2లా అవుతుందేమో అనే భయం కూడా ఉంది. కానీ మైత్రీ నిర్మాతలు ఒప్పుకుంటే రంగస్థలం-2కు నేను రెడీ." అంటూ ప్రకటించాడు సుకుమార్.

సీక్వెల్ చేస్తానంటూనే మనసులో భయాన్ని కూడా బయటపెట్టాడు ఈ దర్శకుడు. ఆర్య సినిమా పెద్ద హిట్ అయింది. దాన్ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో సంబంధం లేకపోయినా మరో సినిమా తీసి దానికి ఆర్య-2 అని పేరుపెట్టారు. అలా ఆర్యకు సీక్వెల్ అంటూ వచ్చిన ఆర్య-2 ఫ్లాప్ అయింది. ఇప్పుడు రంగస్థలం విషయంలో కూడా అది రిపీట్ అయితే తట్టుకోలేనంటున్నాడు సుకుమార్.

భయాన్ని పక్కనపెడితే సుకుమార్ మదిలో రంగస్థలం-2ఉందనే విషయం మాత్రం పక్కా అయింది. అయితే ఇది రంగస్థలానికి కొనసాగింపుగా మాత్రం ఉండదంటున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే మరో కొత్త కథ చెబుతానంటున్నాడు.

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?