రంగమార్తాండ మూవీ ట్రైలర్: కన్న పిల్లలకే చులకనైన నటసామ్రాట్, కారణం?

Published : Mar 20, 2023, 08:33 PM ISTUpdated : Mar 20, 2023, 08:47 PM IST
రంగమార్తాండ మూవీ ట్రైలర్: కన్న పిల్లలకే చులకనైన నటసామ్రాట్, కారణం?

సారాంశం

ప్రకాష్ రాజ్-రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రంగమార్తాండ. చిత్రం విడుదల నేపథ్యంలో ట్రైలర్ విడుదల చేశారు.   

దర్శకుడు కృష్ణవంశీ లాంగ్ గ్యాప్ తర్వాత ఒక ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. రంగమార్తాండ టైటిల్ తో ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ విడుదలకు సిద్ధమైంది. రంగమార్తాండ మరాఠీ చిత్రం నటసామ్రాట్ రీమేక్. ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కింది. ఉగాది కానుకగా మార్చి 22న విడుదల కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేశారు. దాదాపు రెండు నిమిషాల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఎమోషనల్ గా సాగింది.
 
రంగస్థల నటుడిగా కీర్తి సత్కారాలు అందుకున్న రాఘవరావు జీవితం ఎందుకు తారుమారైంది? కన్న పిల్లల ఛీత్కారాలు, సమాజం నుండి అవమానాలు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? రంగమార్తాండ రాఘవరావు కథ ఎలా ముగిసిందనేదే చిత్రం. రంగమార్తాండ పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ఇప్పటికే ప్రీమియర్స్ ప్రదర్శన ముగిసింది. రంగమార్తాండ వీక్షించిన చిత్ర ప్రముఖులు, క్రిటిక్స్ పాజిటివ్ గా స్పందించారు.  

ఇక రంగమార్తాండ మూవీలో కమర్షియల్ పాళ్ళు చాలా తక్కువన్న విషయం ట్రైలర్ తో రుజువైంది. కేవలం ఎమోషన్స్ ఆధారంగా కథ నడిపించారు. కమెడియన్ బ్రహ్మానందం నుండి ఊహించని యాంగిల్.అసలు కామెడీ లేకుండా బ్రహ్మానందం పూర్తి స్థాయి ఎమోషనల్ అండ్ సీరియస్ రోల్ చేసింది లేదు. ప్రకాష్ రాజ్ మిత్రుడిగా ఆయన రంగమార్తాండలో అలాంటి భిన్నమైన పాత్ర చేశారనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ భార్యగా రమ్యకృష్ణ మరోసారి బలమైన పాత్ర చేసినట్లున్నారు.  

ఇళయరాజా సంగీతం అందించారు. శివాత్మిక రాజశేఖర్, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్ కీలక రోల్స్ లో నటించారు.  చిరంజీవి రంగమార్తాండ చిత్రానికి వాయిస్ ఓవర్ చెప్పినట్లు సమాచారం.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌