Udta Teer Trailer: ఇండియాకి వచ్చి గతం మరచిపోయిన పాకిస్తాన్ స్పై..ఆయుష్మాన్ ఖురానా సినిమా ట్రైలర్ అదుర్స్

Published : Sep 23, 2026, 08:08 PM IST
Ayushmann Khurrana

సారాంశం

ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ జంటగా నటించిన 'ఉడ్తా తీర్' ట్రైలర్ వచ్చేసింది. ఇండియాకు వచ్చి గతం మర్చిపోయిన ఓ పాకిస్థాన్ స్పై.. తనను తాను ఇండియన్ స్పైగా అనుకుంటే జరిగే కామెడీయే ఈ సినిమా. 2026 అక్టోబర్ 9న ఈ మూవీ రిలీజ్ కానుంది.

ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ జంటగా నటించిన అప్‌కమింగ్ ఎంటర్‌టైనర్ 'ఉడ్తా తీర్' ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. ఫుల్ కామెడీ, యాక్షన్, అడ్వెంచర్‌తో ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

ఓ సీక్రెట్ మిషన్ మీద ఇండియాకు వచ్చిన పాకిస్థాన్ స్పై (ఆయుష్మాన్ ఖురానా)కి సడెన్‌గా గతం మర్చిపోయే జబ్బు వస్తుంది. ఆ తర్వాత తనను తాను ఇండియన్ స్పైగా ఊహించుకుంటాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. తానెవరో తెలుసుకునే క్రమంలో జరిగే కన్ఫ్యూజన్, కామెడీ, యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయి.

భారీ తారాగణంతో..

ఆకాష్ ఏ కౌశిక్ ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్‌తో పాటు రాహుల్ బోస్, రామ్ కపూర్, సుహైల్ నయ్యర్, గుల్షన్ గ్రోవర్, ముకుల్ దేవ్, రఘుబీర్ యాదవ్, బ్రిజేంద్ర కాలా, సందీప్ ఆనంద్, సుప్రియా పిల్గాంకర్, స్మితా తాంబే లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్నారు.

ప్రొడక్షన్, రిలీజ్ డేట్

కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాయి. 2026 అక్టోబర్ 9న 'ఉడ్తా తీర్' థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Crazy Kalyanam Movie Review: క్రేజీ కళ్యాణం మూవీ రివ్యూ, అనుపమా పరమేశ్వరన్‌ సినిమా ఎలా ఉందంటే?
Bigg Boss 10: తనకి తానే చెంపదెబ్బలు కొట్టుకుని ఏడ్చేసిన వంశీ..ఇక నీ ముఖం కూడా చూడను, షాలినిపై రోహిత్ ఫైర్