ఛాక్లెట్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌కి కరోనా..

Published : Mar 09, 2021, 12:34 PM IST
ఛాక్లెట్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌కి కరోనా..

సారాంశం

ఇటీవల ఎనిమిది రాష్ట్రాల్లో అది మళ్లీ పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఓ వైపు కరోనా, మరోవైపు కొత్త కరోనా `స్ట్రెయిన్‌`తో జనం ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సినీ ప్రియులకు షాక్‌ తగిలింది. రణ్‌బీర్‌ కపూర్‌కి కరోనా సోకింది. 

కరోనా విజృంభన కాస్త తగ్గుముఖం పడుతుందని అంతా ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో, అది మరోసారి విస్తరిస్తుంది. ఇటీవల ఎనిమిది రాష్ట్రాల్లో అది మళ్లీ పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఓ వైపు కరోనా, మరోవైపు కొత్త కరోనా `స్ట్రెయిన్‌`తో జనం ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సినీ ప్రియులకు షాక్‌ తగిలింది. రణ్‌బీర్‌ కపూర్‌కి కరోనా సోకింది. ఆయన కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు ఆయన తల్లి నీతూ కపూర్‌ వెల్లడించారు. 

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా రణ్‌బీర్‌ తల్లి తెలియజేస్తూ, `పరీక్షలో రణ్‌బీర్‌కి కోవిడ్‌ 19 పాజిటివ్‌ వచ్చింది. అతను ఇప్పుడు మెడిసిన్‌ తీసుకుంటున్నారు. ఇంట్లో స్వీయ నిర్భందంలో ఉన్నాడు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అతని ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎవరూ ఆందోళన చెందవద్దు. మీరు చూపిస్తున్న ప్రేమకి ధన్యవాదాలు` అని తెలిపింది. ప్రస్తుతం రణ్‌బీర్‌ కపూర్‌ `బ్రహ్మాస్త్ర` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు `శంషేరా`, `యానిమల్‌`, అలాగే లవ్‌ రంజన్‌తో ఓ సినిమా చేయనున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..
Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్