రణబీర్ కు సీక్రెట్ అకౌంట్ ఉంది.. కత్రినా కామెంట్స్!

By AN TeluguFirst Published May 8, 2019, 11:22 AM IST
Highlights

బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సెలబ్రిటీలంతా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. కత్రినా కూడా రెండేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ లో జాయిన్ అయింది.

ఈ రెండేళ్లలో ఆమె 21.5 మిలియన్ల ఫాలోవర్లను సాధించింది. తాజాగా ఈ బ్యూటీ అర్భాజ్ ఖాన్ నిర్వహించే 'పించ్' అనే షోకి హాజరైంది. ఈ సందర్భంగా తన మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ గురించి ఓ సీక్రెట్ చెప్పేసింది.

మొదట అర్భాజ్ 'కత్రినా మీకు ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్ ఉందా..? వేరే వాళ్లను సీక్రెట్ గా ఫాలో అవుతుంటారా..?' అని ప్రశ్నించగా.. దానికి ఆమె 'లేదు.. లేదు.. కానీ రణబీర్ కు ఉంది.. అసలు ఈ ఇన్స్టా గ్రామ్ ఎలా పని చేస్తుందో నాకు చూపించిందే రణబీర్' అని చెప్పింది. రణబీర్ సంగతి అడగకుండానే కత్రినా అతడి సీక్రెట్ బయటపెట్టేసింది. మరి ఈ విషయంపై రణబీర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

ఇక కత్రినా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్ తో కలిసి 'భారత్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ ఏడాది జూన్ లో ఈద్ సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే అక్షయ్ కుమార్ తో 'సూర్యవంశీ' అనే సినిమాలో నటిస్తోంది. అలీ అబ్బాస్ జఫార్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాకు సైన్ చేసింది. 

click me!