రణబీర్ కపూర్,ఆలియా భట్, విక్కీ కౌశల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. సంజయ్ లీలా బన్సాలీ భారీ మల్టీ స్టారర్..

By Mahesh Jujjuri  |  First Published Jan 24, 2024, 8:16 PM IST

బాలీవుడ్ లో భారీ మల్టీ స్టారర్ రూపుదిద్దుకోబోతోంది. అది కూడా బాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి డైరెక్షన్ లో.. ముగ్గురు స్టార్లతో మూవీ రూపుదిద్దుకోబోతోంది. వివరాల్లోకి వెళ్తే..



బాలీవుడ్ లో మరో ప్రేమ కావ్యం దూపుదిద్దుకోబోతోంది. భారీ మల్టీ స్టారర్ కు అనౌన్స్ మెంట్ వచ్చేసింది. తిరుగులేని విజయాల దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ఓ మూవీని ప్రకటించారు. బాలీవుడ్ స్టార్స్ కపుల్ రణబీర్ కపూర్ - ఆలియా భట్ తో పాటు.. హీరో విక్కీ కౌశల్ కూడా ఈసినిమాలో నటించబోతున్నారు. ఈ ముగ్గురితో వండర్ ఫుల్ లవ్ స్టోరీని ఆయన తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు. దీనికి సబంధించిన ప్రకటన కూడా చేశారు సంజయ్. 

అయితే ఇటు రణబీర్ కపూర్, అలియా భట్ కలిసి మళ్ళీ తమ సూపర్ హిట్ డైరెక్టర్ తో పని చేయబోతున్నారు. లవ్ అండ్ వార్ అంటూ టైటిల్ కార్డుని  కూడా రిలీజ్ చేసి మూవీ కాస్ట్ ని ప్రకటించారు సంజయ్ లీలా బన్సాలి. ఈ సినిమాను గొప్ప ప్రేమ కావ్యం చూపించబోతున్నట్టు తెలుస్తోంది. 

Latest Videos

 

ఇక ఈమూవీ రిలీజ్ డేట్ న కూడా ఇప్పుడే ప్రకటించేశారు. ఈ ప్రేమ కథను 2025 క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తామంటున్నారు. ఈ సినిమా అనౌన్స్ మెంటకు సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ మూవీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ కూడా ఈ పోస్టర్ తో కూడిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

అయితే సంజయ్ లీలా బన్సాలీ చివరి సినిమా ఆలియా భట్ తో చేశారు. ఆలియాతో ఆయన గంగూబాయ్ కతియావాడిని తెరకెక్కించి విమర్శకులు ప్రశంసలు పొందారు. గంగూబాయ్ పాత్రలో ఆలియా నటనకు జాతీయ అవార్డ్ కూడా వచ్చింది. అయితే ఈసినిమా హిట్ తరువాత తాను ఓ ప్రేమ కథతో  సినిమా చేస్తానన్నారు. తను చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ మ్యూజికల్ లవ్ స్టోరీగా ఉంటుందని పేర్కొన్నారు

అనుకున్నట్టుగానే లవ్ అండ్ వార్య కాన్సెప్ట్ తో మూవీని ప్రకటించారు. ఇక ఆలియాకు బన్సాలి తన సినిమాతో జాతీయ అవార్డ్ వచ్చేలా చేస్తే.. రణబీర్ కపూర్ ను ఏకంగా ఇండస్ట్రీకి పరిచయం చేసిందే ఈ స్టార్ డైరెక్టర్. సంజయ్ దర్శకత్వంలో వచ్చిన సావరియా సినిమాతో రణబీర్.. హీరోగా బాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. 

ఇక రణబీర్,ఆలియాలతో విక్కీ కౌశల్ కూడా చేరుతుండటంతో.. ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొననున్నాయి. అంతే కాదు మరో ఆషీకిగా ఈసినిమా ఉండబోతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రణ్ బీర్ యానిమల్ సినిమాతో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ను అందించాడు. ఇక ఈ ముగ్గురి కాంబోతో సంజయ్ లీలా డైరెక్షన్ మరో సంచలనం అవుతుందంటున్నారు ఫ్యాన్స్. 

click me!