సీఎం యోగి ఆదిత్యనాథ్ ని కలిసిన హను మాన్ టీమ్..ప్రశాంత్ వర్మ, తేజ సజ్జాపై ప్రశంసలు

By tirumala AN  |  First Published Jan 24, 2024, 5:36 PM IST

సంక్రాంతి సందడి ముగిసింది. కానీ హను మాన్ జోరు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఈ చిత్రం వరల్డ్ వైడ్ 100 కోట్లకి పైగా షేర్ సాధించి యావత్ సినీ లోకాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. చిన్న చిత్రం గా విడుదలైన హను మాన్ ఈ రేంజ్ ప్రభంజనం సృష్టిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.


సంక్రాంతి సందడి ముగిసింది. కానీ హను మాన్ జోరు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఈ చిత్రం వరల్డ్ వైడ్ 100 కోట్లకి పైగా షేర్ సాధించి యావత్ సినీ లోకాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. చిన్న చిత్రం గా విడుదలైన హను మాన్ ఈ రేంజ్ ప్రభంజనం సృష్టిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ,హీరో తేజ సజ్జా తమ చిత్రాన్ని బలంగా నమ్మి సంక్రాంతి బరిలో నిలిపారు. 

వారి ధైర్యమే ఇప్పుడు అద్భుతాలకు కారణం అవుతోంది. ఆంజనేయ స్వామి నేపథ్యంలో జనరంజకమైన సూపర్ హీరో చిత్రాన్ని ప్రశాంత్ వర్మ ప్రేక్షకులకు అందించారు. సెలెబ్రిటీలంతా హను మాన్ చిత్రాన్ని కొనియాడుతున్నారు. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఇలాంటి అద్భుత కార్యం జరుగుతుంటే.. రామ బంటు హనుమంతుడు ఆధారంగా తెరకెక్కించిన హను మాన్ చిత్రం థియేటర్స్ లో సంచలనాలు చేయడం యాదృచ్చికం అనే చెప్పాలి. 

Latest Videos

ఇదిలా ఉండగా హను మాన్ టీం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని కలిశారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా సీఎం యోగి ఆదిత్య నాథ్ ని సీఎంవో కార్యాలయంలో కలిశారు. ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఎలాంటి భక్తి భావాన్ని నింపుతోంది.. చిన్నారులపై, యువతపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతోంది అనే అంశాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సీఎంకి వివరించారు. 

అలాగే పురాణాలలోని అంశాలని సూపర్ హీరో కథలా మార్చి ఎలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం అనే విషయాన్ని కూడా యోగి ఆదిత్యనాథ్ కి వివరించారు.అయితే యోగి ఆదిత్య నాథ్ హను మాన్ చిత్ర యూనిట్ ని ప్రసంసలతో ముంచెత్తినట్లు తెలుస్తోంది. యోగి తమని అభినందించడం పట్ల ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా సంతోషం వ్యక్తం చేశారు. సినిమాలు భారతీయ సంస్కృత వారసత్వాన్ని కాపాడే విధంగా ఉండాలని సూచించినట్లు చెప్పారు. అలాగే ఇతిహాసాలు, చరిత్రపై మరిన్ని చిత్రాలు వచ్చేలా చూడాలని ప్రోత్సాహించినట్లు తెలిపారు.  

click me!