మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేసిన `విరాటపర్వం` టీజర్‌.. చూస్తే గూస్‌బమ్సే..

By Aithagoni RajuFirst Published Mar 18, 2021, 5:23 PM IST
Highlights

మెగా స్టార్‌ చిరంజీవి `విరాటపర్వం` చిత్ర టీజర్‌ని విడుదల చేశారు.  ఈ టీజర్‌ ఆద్యంతం భావోద్వేగ భరితంగా, ఉద్వేగభరితంగా సాగుతూ ఆకట్టుకుంటుంది. రోమాలు నిక్కబొరిచేలా ఉంది.

`ఆదిపత్య జాడలనే, చెరిపేయగా ఎన్నినాళ్లు..తారతమ్య గోడలనే..పెకిలించగా ఎన్నినాళ్లు..దున్నెటోడి వెన్ను విరిచి, భూస్వాములు ధనికులయిరీ..` అని ఉద్వేగంతో అంటున్నాడు రానా. అందుకు `ప్రియమైన అరణ్య నీ కవితకి నాలో తెలియని భావోద్వేగం రగులుతుంది.. ` అంటోంది సాయిపల్లవి. వీరిద్దరు `విరాటపర్వం`లో చెప్పిన మాటలు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. మెగా స్టార్‌ చిరంజీవి `విరాటపర్వం` చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. ఇది రా అండ్‌ రియలిస్టిక్‌ చిత్రమని,గొప్ప కథని వేణు ఉడుగులు చెబుతున్నారని, చిత్ర బృందానికి ఆయన బెస్ట్ విషెస్‌ తెలియజేశారు. 

Happy to launch .

It looks raw and realistic. Great storytelling by . My best wishes to and .
Good luck to the entire team . https://t.co/hkcQInKwQz

— Chiranjeevi Konidela (@KChiruTweets)

ఈ టీజర్‌ ఆద్యంతం భావోద్వేగ భరితంగా, ఉద్వేగభరితంగా సాగుతూ ఆకట్టుకుంటుంది. రోమాలు నిక్కబొరిచేలా ఉంది. ఇందులో రానా కవితలు చదివి ఇన్‌స్పైర్‌ అయి ఆయన బాటలో నడిచేందుకు వెళ్లిన వెన్నెల పాత్రలో సాయిపల్లవి కనిపించనుందని అర్థమవుతుంది. ఇందులో సాయిపల్లవిపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించడం, చివరకు ఆమె `దొంగ ల..  ది కొడకా` అంటే దుమ్మెత్తి పోయడం గూస్‌బమ్స్ క్రియేట్‌ చేస్తుంది. 

ఇందులో రానా కామ్రేడ్‌ రవన్నపాత్రలో నటిస్తున్నారు. రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటిస్తున్న  `విరాటపర్వం` చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌, ఫస్ట్ లుక్‌లు సినిమాపై అంచనాలను పెంచాయి. అలాగే `కోలు కోలు `పాట సైతం ఉర్రూతలూగించింది. ఇప్పుడు విడుదలైన టీజర్‌ ఉద్యమాన్ని, ప్రేమని ప్రతిబింబిస్తుంది. 

నక్సల్‌ రవన్న అలియాస్‌ డాక్టర్‌ రవిశంకర్‌ జీవితం ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు దర్శకుడు వేణు ఉడుగుల. నక్సల్‌ పోరాటం, విప్లవ భావాలు, కమ్యూనిస్టు ఉద్యమాలు 1990లో ఎలా ఉండేవి, తమకు, పేద ప్రజలకు జరిగిన అన్యాయాలపై రవన్న చేసిన పోరాటం ఉద్యమాన్ని ఇందులో చూపించబోతున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాని ఏప్రిల్‌ 30న విడుదల చేయబోతున్నారు. 
 

click me!