నా ప్రేయసి ఈమెనే.... తేల్చేసిన రానా దగ్గుబాటి

Published : May 12, 2020, 05:28 PM ISTUpdated : May 12, 2020, 06:24 PM IST
నా ప్రేయసి ఈమెనే.... తేల్చేసిన రానా దగ్గుబాటి

సారాంశం

సోషల్ మీడియా వేదికగా గర్ల్‌ ఫ్రెండ్‌ ఫోటోను షేర్ చేశాడు రానా. ఈ ఫోటోతో పాటు ఆమె అంగీకరించింది (షీ సెడ్‌ యస్‌) అంటూ కామెంట్ చేశాడు. అమ్మాయి పేరు మిహీక బజాజ్‌ అంటూ తెలిపాడు రానా. ఈ పోస్ట్ షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది.

ఇన్నాళ్లు టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న మ్యాన్లీ హంక్‌ రానా కూడా త్వరలోనే తన బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌ బై చెప్పేస్తున్నాడు. చాలా కాలంగా రానాకు పెళ్లెప్పుడు అన్న ప్రశ్న ఎదురౌతునే ఉంది. ముఖ్యంగా బాహుబలి ప్రమోషన్ సమయంలో ఈ ప్రశ్న ఎక్కువగా ఎదురుకావటంతో అప్పట్లో నితిన్‌, ప్రభాస్‌ నాకన్నా ముందే ఉన్నారు వాళ్ల పెళ్లి తరువాత నేను చేసుకుంటాను అని చెప్పాడు. అయితే ఇటీవలే నితిన్‌ పెళ్లి పనులు ప్రారంభించగా ఇప్పుడు రానా కూడా తన ప్రేయసిని ప్రపంచానికి పరిచయం చేశాడు.

మంగళవారం సోషల్ మీడియా వేదికగా గర్ల్‌ ఫ్రెండ్‌ ఫోటోను షేర్ చేశాడు రానా. ఈ ఫోటోతో పాటు ఆమె అంగీకరించింది (షీ సెడ్‌ యస్‌) అంటూ కామెంట్ చేశాడు. అమ్మాయి పేరు మిహికా బజాజ్‌ అంటూ తెలిపాడు రానా. మిహికా డ్యూ డ్రాప్‌ డిజైన్‌ స్టూడియో అనే సంస్థను నిర్వహిస్తోంది. చాలా కాలంగా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉన్నట్టుగా తెలుస్తోంది. రానా  ఈ పోస్ట్ షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి
Nayanam Review:తండ్రి వయసు వ్యక్తితో పెళ్లి, భర్తను చింపేసిన భార్య వరుణ్ సందేశ్ ‘నయనం’ ఎలా ఉంది?