మురళీధరన్ బయోపిక్ నిర్మించడానికి కారణమిదే: రానా

Published : Aug 05, 2019, 11:20 AM IST
మురళీధరన్ బయోపిక్ నిర్మించడానికి కారణమిదే: రానా

సారాంశం

ఎవరు ఊహించని విధంగా శ్రీలంక క్రికెటర్ స్టోరీని రానా ఎందుకు ఎంచుకున్నాడు అని అందరిలో ఒక పెద్ద సందేహం నెలకొంది. ఆ విషయంపై రానా ఇటీవల నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. 

శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల వేగం పెరుగుతోంది. సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ పైకి తేవాలని బాహుబలి స్టార్ రానా దగ్గుబాటి ప్రయత్నాలు చేస్తున్నారు. రానా ఈ బయోపిక్ కి సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు. 

అయితే ఎవరు ఊహించని విధంగా శ్రీలంక క్రికెటర్ స్టోరీని రానా ఎందుకు ఎంచుకున్నాడు అని అందరిలో ఒక పెద్ద సందేహం నెలకొంది. ఆ విషయంపై రానా ఇటీవల నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. క్రికెటర్ గా మురళీధరన్ కెరీర్ మొదలైన తరువాత తన బౌలింగ్ తో ప్రపంచాన్ని ఆకర్షించాడు. ఎన్నో రికార్డులు అందుకున్నాడు. 

అయితే కెరీర్ మొదలవ్వడానికి ముందు మురళీధరన్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. అందరికి స్ఫూర్తినిచ్చే ఒక మంచి సందేశం అతని జీవితంలో దాగి ఉంది. ఎన్నో సంఘటనలను కూడా  దైర్యంగా ఎదుర్కొన్నాడు. అందుకే అతని కథను తెరకెక్కించాలని అనిపించినట్లు రానా వివరణ ఇచ్చాడు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమాను రిలీజ్ చేస్తామని కూడా రానా మాట్లాడారు.    

PREV
click me!

Recommended Stories

Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌
Om Shanti Shanti Shantihi Trailer Review: తరుణ్‌ భాస్కర్‌ కి వణుకు పుట్టించిన ఈషా రెబ్బా, ట్రైలర్‌ ఎలా ఉందంటే?