షాకింగ్ : ఎన్టీఆర్, ప్రభాస్ కాంబో,అరవింద్ ప్లానింగ్..?

Published : Aug 01, 2019, 12:11 PM ISTUpdated : Aug 01, 2019, 08:31 PM IST
షాకింగ్  : ఎన్టీఆర్, ప్రభాస్ కాంబో,అరవింద్ ప్లానింగ్..?

సారాంశం

రామాయణం సినిమాలో కీలకమైన పాత్రలు రెండు..ఒకటి రాముడు, రెండు రావణాసురుడు. ఈ రెండు పాత్రల చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. ఈ రెండు పాత్రలకు న్యాయం చేయగల ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. 

జూ.ఎన్టీఆర్ ఏ పాత్ర వేసినా అందులో ఒదిగిపోతాడనటంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈ తరం హీరోలలో పౌరాణిక పాత్ర వేయాలంటే ఏకైక ఆప్షన్ ఎన్టీఆర్. దాంతో  అల్లు అరవింద్ తను నిర్మిస్తున్న రామాయణం చిత్రంలో ఎన్టీఆర్ కు కీలకమైన పాత్ర ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో ఓ సమస్య వస్తోందిట. దాంతో తన డైరక్టర్స్ తో, టీమ్ తో ఆయన చర్చిస్తున్నారట. ఇంతకీ అల్లు అరవింద్ కు వచ్చిన సమస్య ఏమిటి...?

రామాయణం సినిమాలో కీలకమైన పాత్రలు రెండు..ఒకటి రాముడు, రెండు రావణాసురుడు. ఈ రెండు పాత్రల చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. ఈ రెండు పాత్రలకు న్యాయం చేయగల ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. అందులోనూ మరీ ముఖ్యంగా రావణాసుడు పాత్ర అయితే చించి ఆరేస్తాడని గతంలో యముడు గా కనిపించిన ఎన్టీఆర్ ప్రూవ్ చేసారు. అయితే ఎన్టీఆర్ రావణాసురుడు వేస్తే అవతల రాముడు పాత్రధారి సరైన వాడు కాకపోతే తేలిపోతుంది. సినిమా మొత్తం రావణాసుకుడు వైపు ఒరిగిపోతుంది.

 దాంతో ప్రభాస్ ని రాముడుగా అడిగితే ఎలా ఉంటుంది అనే ఆలోచన సైతం టీమ్ చేస్తోందిట. అటు ప్రభాస్, ఇటు ఎన్టీఆర్ కాంబినేషన్ కేక పెట్టిస్తుందంటున్నారు. బాహుబలితో ప్రబాస్ కు నేషనల్ మార్కెట్ రావటం సైతం కలిసి వస్తుంది. అయితే ప్రభాస్ , ఎన్టీఆర్ అంటే అన్ని రోజులు డేట్స్ ఇవ్వగలిగాలి. ఇదో భారీ ప్రాజెక్టు కావటంతో రెమ్యునేషన్స్ కూడా అదే స్దాయిలో ఇవ్వగలిగాలి. ఇవన్నీ లెక్కలేసి మరీ వీళ్లని కలుద్దామనే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్సో  వినపడుతోంది. అయితే అది ఎంతవరకూ ముందుకు వెళ్తుంది అనేది తెలియాల్సి ఉంది. 

 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం