రామ్ ప్లాప్ సినిమా.. యూట్యూబ్ హిట్టు!

Published : Feb 04, 2019, 08:10 PM IST
రామ్ ప్లాప్ సినిమా.. యూట్యూబ్ హిట్టు!

సారాంశం

ఈ మధ్య కాలంలో పెద్ద స్క్రీన్ పై డిజాస్టర్ అవుతున్న సినిమాలు ఇంటర్నెట్ స్క్రీన్లపై మాత్రం బలే హిట్టవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలు హిందీలో డబ్ చేసి రిలీజ్ అవుతూ యూ ట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా యువ హీరో రామ్ సినిమా కూడా ఒకటి యూ ట్యూబ్ లో హిట్టయింది. 

కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఉన్నది ఒక్కటే జిందగీ 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకుముందు దర్శకుడు హీరో రామ్ నేను శైలజ సినిమాతో హాట్ కొట్టడంతో ఆ సినిమా తప్పకుండా హిట్టవుతుందని అనుకున్నారు. కానీ సినిమా ప్లాప్ లిస్ట్ లో చేరిపోయింది. 

అయితే యూ ట్యూబ్ లో హిందీలో డబ్ చేసి 'నెంబర్ వన్ దిల్' వాలా పేరుతో రిలీజ్ చేయగా.. విడుదలైన రెండు రోజులకే 25 మిలియన్ల వ్యూస్ తో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో అనుపమ - లావణ్య త్రిపాటి హీరోయిన్స్ గా నటించారు.  

PREV
click me!

Recommended Stories

పూలచీరలు కట్టిన ప్రియాంక చోప్రా
Mohan Babu చిరంజీవి అన్నదమ్ములుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?