Tollywood Updates: రామ్ పోతినేని వైరల్ లుక్.. అప్సర రాణి కొత్త చిత్రం, నీ దారే నీ కథ టీజర్..క్రేజీ అప్డేట్స్

By tirumala ANFirst Published Mar 20, 2024, 11:06 PM IST
Highlights

యంగ్ హీరో రామ్ పోతినేని ఓ షాపింగ్ మాల్ లాంచ్ కార్యక్రమంలో హైదరాబాద్ లో పాల్గొన్నాడు. బీహెచ్ఈఎల్ లో జరిగిన ఈ ఈవెంట్ లో పాల్గొన్న రామ్ ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. 

యమా స్టైలిష్ గా రామ్ పోతినేని 

యంగ్ హీరో రామ్ పోతినేని ఓ షాపింగ్ మాల్ లాంచ్ కార్యక్రమంలో హైదరాబాద్ లో పాల్గొన్నాడు. బీహెచ్ఈఎల్ లో జరిగిన ఈ ఈవెంట్ లో పాల్గొన్న రామ్ ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. రామ్ మైండ్ బ్లోయింగ్ స్టైలిష్ లుక్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. 

ఫుల్లీ లోడెడ్ వెపన్ లాగా రామ్ క్రేజీగా కనిపించాడు. ఫ్యాన్స్ అంతా డబుల్ ఇస్మార్ట్ అంటూ కేరింతలు కొట్టారు. ప్రస్తుతం రామ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

నీదారే నీ కథ మూవీ టీజర్ లాంచ్ 

జె.వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై వంశీ జొన్నలగడ్డ నిర్మాతగా, దర్శకుడుగా వ్యవహరిస్తూ తేజేష్ వీర, శైలజ సహనిర్మాతలుగా ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా నీ దారే నీ కథ టీజర్ లాంచ్ ఈవెంట్ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారు, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు మరియు క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ గారు చేతుల మీదుగా చాలా ఘనంగా జరిగింది. మొత్తం కొత్త టీం తో ఈ ఈవెంట్ ని ఇన్నోవేటివ్ గా కొత్తగా చేశారు. మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ తో మొత్తం కొత్త వాళ్ళతో ఈ సినిమా యువతను ఆకట్టుకునే విధంగా ఉండబోతోంది.



నిర్మాత తేజేష్ మాట్లాడుతూ : ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ముగ్గురు కొత్త వాళ్ళం అందరూ కొత్త టీం తోనే ఈ సినిమాని నిర్మిస్తున్నాం. ఇది మా మొదటి సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా కొత్తగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. తర్వాత వచ్చే సినిమాలు కూడా అంతే కొత్తగా ఉంటాయి. మాకు బ్యాక్ బోన్ సపోర్ట్ ఏమీ లేదు. మీ మీడియానే మాకు పెద్ద సపోర్ట్. మాకు మొదటి సినిమా అయినా ఇంత సపోర్ట్ చేస్తున్నా ప్రింట్ మరియు టెలివిజన్ మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా మమ్మల్ని సపోర్ట్ చేసి ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారికి మరియు క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ గారికి మరియు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

అరుణ్ ఆదిత్య - అప్సర రాణి జంటగా కొత్త సినిమా ప్రారంభం

అరుణ్ ఆదిత్య - అప్సర రాణి జంటగా, వినూత్న సెల్యూలాయిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కృష్ణబాబు దర్శకత్వంలో కొత్త సినిమా ప్రొడక్షన్ నం.1 ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మం ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. జస్ట్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ.. ఈ   కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ డైరెక్ట‌ర్ వి. సముద్ర తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం వ‌హించ‌గా, ప్ర‌ముఖ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ హీరోయిన్‌పై క్లాప్ కొట్టారు. తొలిషాట్‌కు సంగీత దర్శకురాలు యం యం శ్రీ‌లేఖ కెమెరా స్విచ్చాన్  చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా డైరెక్టర్ కృష్ణబాబు మాట్లాడుతూ.. ''సినిమా ప్రారంభోత్స‌వం ఒక పండ‌గ‌గా జ‌రగ‌డం సంతోషంగా ఉంది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అతిథుల‌కు ధ‌న్య‌వాదాలు. ఏప్రిల్ 20 నుంచి 10 రోజుల పాటు షెడ్యూల్ చేస్తాం. స‌బ్జెక్టు బాగా వ‌చ్చింది. అరుణ్ ఆదిత్య - అప్సర రాణి జంట‌గా చేస్తున్న‌ ఈ సినిమా ఖ‌చ్చితంగా అంద‌రికి న‌చ్చుతుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తాం..'' అని తెలిపారు.

అప్సరరాణి మాట్లాడుతూ... ''మంచి రోజు మంచి సినిమా ప్రారంభమైంది. సంతోషంగా ఉంది. నా కెరీర్‌కు ఈ సినిమా మంచి హెల్ప్ అవుతుంద‌న్న నమ్మకంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్‌కు, డైరెక్ట‌ర్‌కు ధ‌న్య‌వాదాలు..'' అని తెలిపారు.  

తిరుపతిలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేసిన సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని

ఊర్వశివో రాక్షసివో, బేబి, అంబాజీపేట మ్యారేజి బ్యాండు వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన ప్రొడ్యూసర్ గానే కాదు సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్ గా పలు సూపర్ హిట్ సినిమాలను పంపిణీచేస్తున్నారు. బేబి, గుంటూరు కారం, హనుమాన్, గామి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ను పంపిణీ చేసి డిస్ట్రిబ్యూషన్ రంగంలో దూసుకెళ్తున్నారు ధీరజ్ మొగలినేని.

ఆయన తాజాగా సీడెడ్ ఏరియా పంపిణీ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ యతితో కలిసి తిరుపతిలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేశారు ధీరజ్ మొగిలినేని. ప్రస్తుతం ఆయన శ్రీ విష్ణు హీరోగా నటించిన 'ఓం భీమ్ బుష్', సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్'తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తిరుపతిలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ ఆఫీస్ ఓపెన్ సందర్భంగా ఆయనకు ఇండస్ట్రీ మిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితుల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి.

click me!