రామ్‌ ఫస్ట్ బైలింగ్వల్‌ షూటింగ్‌కి రెడీ.. ఎప్పట్నుంచంటే ?

Published : Jul 07, 2021, 04:05 PM IST
రామ్‌ ఫస్ట్ బైలింగ్వల్‌ షూటింగ్‌కి రెడీ.. ఎప్పట్నుంచంటే ?

సారాంశం

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని తెలుగు, తమిళంలో చేస్తున్న బైలింగ్వల్‌ చిత్రం షూటింగ్‌కి  రెడీ అయ్యింది. తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్‌లో రామ్‌ ఓ సినిమాని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని తెలుగు, తమిళంలో చేస్తున్న బైలింగ్వల్‌ చిత్రం షూటింగ్‌కి  రెడీ అయ్యింది. తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్‌లో రామ్‌ ఓ సినిమాని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. ఈ నెల 12 నుంచి రెగ్యూలర్‌ షూటింగ్‌ స్టార్ట్ చేయబోతున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది.  

`అనువాద సినిమాలతో తమిళ, హిందీ ప్రేక్షకులకు రామ్ చేరువైనా స్ట్రయిట్ తమిళ సినిమా చేయలేదు. అటు దర్శకుడు లింగుసామి తెలుగులో చేయలేదు. ఈ కాంబినేషన్‌లో తెలుగు, తమిళ బైలింగ్వల్ సినిమా తెరకెక్కబోతుంది. స్టయిలిష్ రోల్స్‌తోపాటు మాస్ క్యారెక్టర్లలో మెప్పించిన రామ్‌ను లింగుస్వామి ఎలా చూపిస్తారోననే ఆసక్తి అందరిలో నెలకొంది. ఫుల్ నేరేషన్ తర్వాత రామ్ చేసిన ట్వీట్ అంచనాలకు మరింత పెంచింది. ఇదే హుషారులో ఊర మాస్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి టీమ్ రెడీ అవుతోంది. 

రామ్ నటిస్తున్న తొలి బైలింగ్వల్ సినిమా ఇది. 'రన్', 'ఆవారా', 'పందెంకోడి' వంటి సూప‌ర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన లింగుసామి చేస్తున్న మొదటి స్ట్రయిట్ తెలుగు చిత్రమిది. రామ్ సరసన 'ఉప్పెన' ఫేమ్ కృతీ శెట్టి హీరోయిన్‌గా నటించనున్నారు.  'దృశ్యం', 'లూసిఫర్' వంటి బ్లాక్‌ బస్టర్ చిత్రాలకు అని చేసిన టాప్ సినిమాటోగ్రాఫర్ సుజీత్ వాసుదేవ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. 'కె.జి.యఫ్' చిత్రానికి పని చేసిన అన్బు- అరివు ద్వయం యాక్షన్ కొరియోగ్రఫీ చేయనున్నారు. ఇటీవల 'క్రాక్' చిత్రానికి పవర్‌ఫుల్ డైలాగ్స్ రాసిన ప్రముఖ సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా   ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. జాతీయ పురస్కార గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నార`ని చిత్ర బృందం తెలిపింది. 

చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ, `చాలా కాలంగా రామ్‌గారితో సినిమా చేయాల‌ని మంచి స‌బ్జెక్ట్ కోసం చూస్తున్నాం. లింగుసామిగారు చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ ఊర మాస్ స‌బ్జెక్ట్ మా అంద‌రికీ న‌చ్చి రామ్‌గారికి వినిపించాం. క‌థ విన‌గానే ఆయ‌న కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు.  రీసెంట్‌గా రామ్‌కు లింగుసామి ఫైనల్ నేరేషన్ ఇచ్చారు. హీరో మరింత ఎగ్జైట్ అయ్యారు. ఈ నెల 12న హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ లవ్ సాంగ్ ట్యూన్ కంపోజ్ చేశారు. మిగతా సాంగ్స్ కూడా అద్భుతంగా వస్తున్నాయి. 

సినిమాటోగ్రాఫర్ సుజీత్ వాసుదేవ్, యాక్షన్ కొరియోగ్రాఫర్లు అన్బు-అరివు, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి, సాయిమాధవ్ బుర్రా వంటి టాప్ టెక్నీషియన్లు సినిమాకు పని చేస్తున్నారు. మా బ్యాన‌ర్‌లో భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రెస్టీజియ‌స్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నాం. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తాం` అని తెలిపారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే
Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే